![Hardik Pandya](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/Hardhik.webp)
Hardik Pandya : టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఇన్ స్టాలో కూడా హర్దిక్ పాండ్యా గర్ల్స్ ను అస్సలు నమ్మొద్దని చెబుతూ బ్రేక్ హర్ట్ సింబల్ ఉన్న ఇమోజీ పెట్టాడు. దీంతో వీరిద్దరి డైవర్స్ నిజమనే అనుకుంటున్నారు.
హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యా కలిసి ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో జోడి అపార్ట్ మెంట్లను అద్దెకు తీసుకున్నారు. ఈ అపార్ట్ మెంట్లలో ఉండే హర్దిక్ పాండ్యా నెలకు దాదాపు 2.5 లక్షలు రెంట్ కడుతున్నట్లు తెలుస్తోంది. వీటిపై పాండ్యా సోదరుడు వైభవ్ హిమాన్షు పాండ్యా సంతకం చేసినట్లు తెలుస్తోంది. మొదటి 36 నెలల్లో రూ. 2. 5 లక్షలు. ఆ తర్వాత 2.80 లక్షలు కట్టాలని అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఇంత ఎక్కువ రెంట్ పెట్టి భార్యను బాగా చూసుకుంటున్నా ఆమె విడాకులు కోరడంపై హర్దిక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
హర్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ సెర్బియన్ నటి. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు. కొన్ని రోజల్లోనే కొంతమంది రోడ్ మీదకు రాబోతున్నారని నటాషా తన ఇన్ స్టా గ్రాం పోస్టులో తెలిపింది. దీంతో హర్దిక్ పాండ్యా, నటాషా దంపతులు డైవర్స్ కు అప్లై చేశారని కన్పర్మ్ అయిపోయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. హర్దిక్ కూడా హర్ట్ బ్రేక్ ఇమేజ్ ఇన్ స్టాలో పోస్టు చేయడంతో నిజమే అని తెలుస్తోంది.
హర్దిక్ పాండ్యా గతంలో ఓ సారి ఒక ప్రయివేట్ టీవీ షోలో మాట్లాడుతూ.. తన ఆస్తిలో ప్రతిది మా అమ్మ పేరు మీదే ఉంటుందని చెప్పాడు. దాదాపు ఇప్పటి వరకు 50 శాతం పైగా అమ్మ పేరు మీదనే ఉంచినట్లు చెప్పాడు. అయితే నటాషా విడాకుల కోసం ట్రై చేయడం కేవలం హర్దిక్ కు ఉన్న 70 శాతం ఆస్తిని కొట్టేయడానికే అని ప్రచారం జరుగుతోంది. 70 శాతం భరణం కింద చెల్లించాలని నటాషా కోర్టులో డైవర్స్ కు అప్లై చేసినట్లు సమాచారం. కానీ హర్దిక్ ఇదంతా ముందే గ్రహించి తన తల్లి పేరు మీదనే ఆస్తులు ఉంచడం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి నువ్వు సరైనోడివి బాస్ అని పొగుడుతున్నారు.