34.1 C
India
Monday, June 17, 2024
More

    ప‌త్రికా స్వేచ్ఛ‌లో మన ర్యాంక్ ఎక్కడో తెలుసా..!

    Date:

    press freedom
    press freedom

    ప్ర‌జాస్వామ్యానికి ఆయువుప‌ట్టు నాలుగు స్థంబాలు. అందులో ఒకటి శాస‌న శాఖ కాగా..రెండోది కార్య‌నిర్వాహ‌ణ‌,న్యాయ‌శాఖ‌లు. ఇక ఈ మూడు విభాగాలు మాత్ర‌మే కాదు..ప్ర‌జాస్వామ్యంలోని నాలుగో స్థంబ‌మే ప‌త్రిక‌లు,ప్ర‌సార మాధ్య‌మాలు. వాస్త‌వానికి ఏ దేశంలోనైనా డెమోక్ర‌సీ మూడు పువ్వులు ఆరు కాయాలుగా వ‌ర్ధిల్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఆ దేశంలో ప‌త్రిక‌లు,ప్ర‌సార మాధ్య‌మాల‌కు మంచి ఆద‌ర‌ణ ఉండాలి.

    ఇందుకు గాను ఆయా దేశాల్లో ప్ర‌భుత్వాలు ప‌త్రిక‌ల‌కు పూర్తి స్వేచ్చ‌నివ్వాలి. అప్పుడే డెమోక్ర‌సీకి అర్థం ప‌ర్థం ఉంటుంది.కానీ,ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామిక దేశ‌మ‌ని చెప్పుకుంటున్న భార‌త్‌లో అలాంటి ప‌రిస్థితులు లేవ‌ని ఓ అధ్యాయ‌నం ద్వారా తేలింది. కొన్ని సూచికల ఆధారంగా రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ సంస్థ ఆయా దేశాల్లో ప‌త్రికా స్వేచ్చ‌పై ఒక పట్టికను త‌యారు చేసింది. అందుకు సంబంధించిన ర్యాంకుల‌ను విడుదల చేసింది.

    అయితే ఈ సంస్థ విడుద‌ల చేసిన జాబితాలో భార‌త్‌కు అత్యంత ఎక్కువ ర్యాంకు రావ‌డం శోచ‌నీయం. రిపోర్ట‌ర్స్ వితౌట్ బోర్డ‌ర్స్ సంస్థ వెల్ల‌డించిన ర్యాగింగ్స్‌లో ఇండియాకు 140వ స్థానం ద‌క్కింది. తాను  వెల్ల‌డించిన నివేదికలో భార‌త్‌లో ప‌త్రికా స్వేచ్ఛ‌కు చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులున్నాయ‌ని ప్ర‌క‌టించింది. నాల్గ‌వ స్థంభంగా చెప్పుకునే ప‌త్రిక‌లు,మీడియాకు మ‌న దేశంలో విలువ లేద‌ని వెల్ల‌డించింది.

    అయితే మ‌న క‌న్న యూర‌ప్‌,అమెరికా వంటి దేశాల్లో ప‌త్రికా స్వేచ్ఛ‌కు మంచి ఆద‌ర‌ణ ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. మీడియాకు ఫ్రీడం ఇవ్వ‌డంలో ఫిన్‌ల్యాండ్,ఐర్లాండ్‌,నెద‌ర్లాండ్ వంటి దేశాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయ‌న్నారు. ప‌త్రికా స్వేచ్చ విష‌యంలో జ‌పాన్ 51వ స్థానంలో ఉంద‌ని,అమెరికా 53,యూకే 27,ఇటలీ 40,ఫ్రాన్స్ 35,జర్మనీ23వ స్థానాల్లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక క‌మ్యూనిస్టు,ఇస్లామిక్ ప్ర‌భావిత దేశాల్లో ప‌త్రికా స్వేచ్చ‌కు పెద్ద‌గా స్థానం లేద‌ని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ప్రస్తుత ప్రపంచంలో పత్రికల స్థానమెక్కడ..?

       World-Press-Freedom-Day-min ప్ర‌జాస్వామ్యం నాలుగు కాలాల పాటు ఫ‌రిడ‌విల్లాలంటే న్యాయ‌,శాస‌న‌,కార్య‌నిర్వ‌హ‌క వ్య‌వ‌స్థ‌లే కాదు.. డెమోక్ర‌సీలో...