40 C
India
Sunday, May 26, 2024
More

    ప్రస్తుత ప్రపంచంలో పత్రికల స్థానమెక్కడ..?

    Date:

      World-Press-Freedom-Day-min

    World-Press-Freedom-Day-min

    ప్ర‌జాస్వామ్యం నాలుగు కాలాల పాటు ఫ‌రిడ‌విల్లాలంటే న్యాయ‌,శాస‌న‌,కార్య‌నిర్వ‌హ‌క వ్య‌వ‌స్థ‌లే కాదు.. డెమోక్ర‌సీలో నాలుగో స్థంబంగా చెప్పుకునే ప‌త్రిక‌ల‌ పాత్ర కూడా కీల‌క‌మైందే. ఈ మూడు వ్య‌వ‌స్థ‌లు త‌మ త‌మ విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌లేన‌ప్పుడు వాటిలోని లోపాల‌ను,వాటిని నియంత్రిస్తున్న వారి క‌న్నింగ్ నేచ‌ర్‌ను బ‌య‌ట‌పెట్టేవే ప‌త్రిక‌లు. అందుకే అక్ష‌ర రూపం దాల్చిన ఒకే ఒక్క అర్థ‌వంత‌మైన సిరా చుక్క ల‌క్ష‌ల మెద‌ళ్ల‌కు క‌ద‌లిక‌ని అంటారు పెద్ద‌లు.

    ముఖ్యంగా భార‌త్ లాంటి దేశాల్లో సివిల్ సోసైటీలు అంత‌గా అవేర్ నేస్ లేని ప‌రిస్థితి. ద‌క్షిణ భార‌త్ తో పోల్చితే ఉత్త‌ర భార‌త్‌లో ఆ సిచ్యుయేష‌న్ మ‌రీ దారుణం. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌,బీహార్‌,జార్ఘండ్,ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనైతే ప‌రిస్థితులు శోచ‌నీయం. ఇక తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌త్రిక‌ల స్థితి పూర్తిగా మారిపోయింది. నాలుగో స్థంబంగా చెప్పుకునే ప‌త్రిక‌ల‌కు అస‌లు స్థాన‌మే లేకుండా పోయింది తెలంగాణ‌లో.

    రాష్ట్రంలో కూడా ప్ర‌స్తుతం ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌,బీహార్ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఒక వార్త‌ను కూడా ఇప్పుడు రాష్ట్రంలో ధైర్యంగా రాసే ద‌మ్ము తెలంగాణ‌లోని ఏ ప‌త్రికా యాజ‌మాన్యాల‌కు లేదు. ఎప్పుడో ఒక‌సారి ఆంధ్ర‌జ్యోతి,వెలుగు వంటి ప‌త్రిక‌లు ప్ర‌భుత్వంలో జ‌రిగే లోపాల‌ను ఎత్తిచూపిస్తున్నాయి. అయితే వీటిని కూడా స‌ర్కార్ అణ‌చివేస్తుంద‌నే అభిప్రాయ‌ముంది. అంతేకాక ముఖ్య‌మైన మీడియా సంస్థ‌ల‌న్నింటిని కేసీఆర్ త‌న గుప్పిటి ప‌ట్టుకున్నాడ‌నే ఆరోప‌లున్నాయి.    అందువ‌ల్ల తెలంగాణ‌లో పూర్తి స్థాయిలో ప‌త్రికా స్వేచ్ఛ ఉంద‌ని చెప్ప‌లేం.

    మ‌రోవైపు కేంద్ర స‌ర్కార్ విధానాలు కూడా అలాగే ఉన్నాయ‌ని చెప్పొచ్చు. సెంట‌ర్‌లో ప‌ది సంవ‌త్స‌రా లుగా న‌రేంద్ర మోడీ హ‌వా కొన‌సాగుతోంది. బీజేపీ,ఏన్‌డీఏ భాగ‌స్వామ్య‌ ప‌క్షాల్లో ఈయ‌న‌కు తిరుగే లేదు. అయితే జాతీయ స్థాయిలో అనేక భావ‌జాలాలు క‌ల్గిన పార్టీల‌కు సంబంధించిన మీడియా సంస్థ‌లు న్నందు కొంత వ‌ర‌కు న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వాన్ని స‌వాల్ చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ అలాంటి మీడియా సంస్థ‌లు నియంత్రిస్తూనే ఉన్నారు. అందుకే భార‌త్ లో ప‌త్రికా స్వేచ్చ గురించి ఇలా ప్ర‌పంచ ప‌త్రికా దినోత్స‌వం వ‌చ్చిన రోజున త‌ప్ప ఇత‌ర రోజుల్లో ప‌బ్లిక్ భావాలు ప‌త్రిక‌ల్లో క‌నిపించ‌డం చాలా స్వ‌ల్ప‌మే అని చెప్పొచ్చు.

    Share post:

    More like this
    Related

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్...

    Teacher Suspension : స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడని టీచర్ సస్పెన్షన్

    Teacher Suspension : స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని ఓ టీచర్...

    Hardik-Natasa : హర్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నాడా..  నటాషా ఇన్ స్టా పోస్టుతో ప్రకంపనలు

    Hardik-Natasa : టీం ఇండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నడనే...

    CM Revanth : ఎంత పెద్ద సెలబ్రేటీలు ఉన్నా.. వదిలిపెట్టేది లేదు..

    CM Revanth : డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద సెలబెట్రీలు ఉన్నా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Journalist : చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్..

    Journalist : రాజస్థాన్ లోని దుంగార్ పూర్ లో ఓ జర్నలిస్టుపై...

    Nara Lokesh : జర్నలిస్టులకు నారా లోకేష్ కీలక హామీ..

    Nara Lokesh : టీడీపీ యువ నేత లోకేష్ రాష్ర్టంలో యువగళం...

    ప‌త్రికా స్వేచ్ఛ‌లో మన ర్యాంక్ ఎక్కడో తెలుసా..!

    ప్ర‌జాస్వామ్యానికి ఆయువుప‌ట్టు నాలుగు స్థంబాలు. అందులో ఒకటి శాస‌న శాఖ కాగా..రెండోది...