27.6 C
India
Wednesday, June 26, 2024
More

    Kavya Maran : కావ్య కన్నీటి పర్యంతం.. ఓదార్చిన ఎస్ఆర్ హెచ్ అభిమానులు

    Date:

    Kavya Maran
    Kavya Maran

    Kavya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఫ్రాంచైజీ ఓనర్ కన్నీటి పర్యంతమయ్యారు. కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ 18 ఓవర్లకే  టీం 113 పరుగులకే ఆలౌట్ అయి ఇన్సింగ్స్ ముగించింది. మ్యాచ్ లో ఎలాగైనా బౌలర్లు రాణిస్తారని అనుకున్నారు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ కు సెకండ్ బ్యాటింగ్ కు ఎంతో తేడా ఉండటంతో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించారు.

    మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ప్యాట్ కమిన్స్ చేసిన పొరపాటని తేలిపోయింది. దీంతో వెంకటేశ్ అయ్యర్, రహ్మనుల్లా గుర్బాజ్ ఇద్దరు ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో చెలరేగి 10.3 ఓవర్లలోనే మ్యాచ్ ను గెలిపించి ఫైనల్లో కోల్ కతాను విజయ తీరాలకు చేర్చారు.

    అయితే మొన్నటి మ్యాచ్ వరకు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎంతో ధైర్యంగా ఉండేది. మ్యాచ్ ఓడిపోయినా కూడా ఎక్కడా తాను కన్నీరు కార్చిన సందర్భాలు కనిపించలేవు. సన్ రైజర్స్ ఫైనల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా ఓడిపోయే సరికి కన్నీటిని ఆపుకోలేకపోయింది. కోల్ కతా గెలుపు సంబరాల్లో మునిగిపోతే కావ్య మాత్రం వెక్కి వెక్కి ఏడ్చింది. కన్నీటిని ఎంత దిగమింగుకోవాలని చూసినా.. ఆమె వల్ల కాలేదు.

    దీంతో స్టేడియంలోనే ఆమె ఏడ్వడం చూసి సన్ రైజర్స్ అభిమానులు ఆమెను సోషల్ మీడియా ద్వారా ఓదార్చుతున్నారు. మ్యాచుల్లో గెలుపు ఓటములు సహజం. అయినా నీవు తీసుకున్న నిర్ణయమే పదో స్థానం నుంచి రెండో స్థానానికి చేర్చింది. చివరి మెట్టుపై బోల్తా పడినా సన్ రైజర్స్ పై ఎప్పటికీ మా అభిమానం పోదని చెబుతున్నారు. కావ్య మారన్ మీరు ఏడిస్తే మేము తట్టుకోలేమని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఫ్రాంచైజీ ఓనర్లు ఓడిపోయినపుడు ఏడ్చిన సందర్భాలు తక్కువే. కానీ కావ్య మారన్ ఏడిస్తే మాత్రం సన్ రైజర్స్ అభిమానులు కూడా తట్టుకోలేకపోయారు. టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది ఫ్యాన్స్ కూడా డిసాప్పాయింట్ అయ్యారు.

    Share post:

    More like this
    Related

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Modi viral Pics : ఎమర్జెన్సీ సమయంలో వివిధ వేషధారణల్లో మోదీ.. వైరల్ ఫొటోలు

    Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని...

    Tirupati Laddu : తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది

    Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టిన ప్లేయర్లు వీళ్లే

    IPL 2024 : 2024 ఐపీఎల్ 17 వ సీజన్ లో...

    SRH : క్వాలిఫయర్-1లో ఓడిన ఎస్ఆర్ హెచ్ చాంపియన్ గా అవతరిస్తుందా?

    SRH : ఐపీఎల్-2024 సీజన్ ప్రస్తుతం ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. కోల్‌కతా నైట్...

    KKR Vs SRH : కోల్ కతా ఫైనల్ కు.. సన్ రైజర్స్ మరో చాన్స్ 

    KKR Vs SRH : కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...