SRH : ఐపీఎల్-2024 సీజన్ ప్రస్తుతం ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఇప్పటికే క్వాలిఫయర్-1లో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. కాగా, క్వాలిఫయర్-1లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు టైటిల్‌ను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మే 24 క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్లో కేకేఆర్‌తో తలపడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ గెలిస్తే ఐపీఎల్లో సరికొత్త చరిత్ర
హైదరాబాద్ జట్టు ఈసారి టైటిల్ గెలిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఐపీఎల్లో క్వాలిఫయర్-1లో ఓడినా టైటిల్‌ను కైవసం చేసుకున్న రెండో జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇంతకు ముందు ముంబై ఇండియన్స్ మాత్రమే ఈ ఘనత సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబయి జట్టు ఒకటి కాదు రెండు సార్లు ఇలా చేసింది. 2013, 2017లో ముంబై జట్టు క్వాలిఫయర్-1లో ఓడి క్వాలిఫయర్-2లో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఆ తర్వాత రెండు సార్లు, క్వాలిఫయర్-1లో ఎవరి చేతిలో ఓడిపోయారో అదే జట్టును ఓడించి టైటిల్‌ను కైసవం చేసుకుంది.
క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు ఫైనల్ లో ఛాంపియన్
2017 సీజన్లో క్వాలిఫయర్-1లో ఓడిన ముంబై ఛాంపియన్‌గా నిలిచింది, ఆపై ఫైనల్లో పూణే సూపర్ జెయింట్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
2013 సీజన్లో ముంబై క్వాలిఫయర్-1లో ఓడి ఛాంపియన్‌గా నిలిచింది, ఆపై ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
క్వాలిఫయర్ రౌండ్లో ఛాంపియన్ జట్ల రికార్డులు ఇవే..
క్వాలిఫైయర్లు, ఎలిమినేటర్ల పద్దతి 2011 నుంచి ప్రారంభమైంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మాత్రమే క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్ లో చాంపియన్‌గా నిలిచింది. ఎలిమినేటర్‌లో ఒక్కసారి మాత్రమే ఆడిన జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
క్వాలిఫయర్-1లో 10 సార్లు గెలిచిన జట్టు ఆ సీజన్లో టైటిల్‌ను సాధించింది. సీఎస్కే 4 సార్లు, ముంబై ఇండియన్స్ 3 సార్లు టైటిల్ సాధించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు సార్లు, గుజరాత్ టైటాన్స్ జట్టు ఒకసారి టైటిల్ సాధించాయి.