
తెలంగాణ ముఖ్యమంత్రి , భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కేసీఆర్ ) న్యూఢిల్లీలోని BRS పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. సర్దార్ పటేల్ మార్గ్ లో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ కార్యాలయం ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. రేపు డిసెంబర్ 14 న ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయం ప్రారంభం తర్వాత రాజశ్యామల యాగం చేయనున్నారు కేసీఆర్. రెండు రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. దాంతో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున దేశ రాజధాని ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. 2024 లో పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతున్నందున అప్పటి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలనే తపనతో ఉన్నారు కేసీఆర్.
