
బ్రేకింగ్ న్యూస్…….. ఈడీ ముందు నుండి చెబుతున్నట్లుగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉందని స్పష్టం చేశారు. గత మూడు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే పలువురి పై కేసులు నమోదు చేసినప్పటికీ , కవిత పేరు వినబడినప్పటికి ఆమె పేరు మాత్రం FIR లో నమోదు కాకపోవడంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. కట్ చేస్తే తాజా రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్లు స్పష్టం చేసింది ఈడీ. దాంతో గులాబీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయంగా బీజేపీ – టీఆర్ఎస్ మరింతగా యుద్ధానికి సిద్ధం అవ్వడం ఖాయం.