32.5 C
India
Wednesday, June 26, 2024
More

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    Date:

    DC Vs LSG
    DC Vs LSG

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో లక్నో బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో లక్నో కు ప్లే ఆప్ కు వెళ్లే  అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో భీకరమైన ఫామ్ లో ఉన్న జేమ్స్ ప్రేజర్ ముగుర్క్ డకౌట్ కాగా.. అభిషేక్ పొరేల్ 33 బంతుల్లోనే 55 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. నాలుగు సిక్సులు, అయిదు ఫోర్లతో చెలరేగి ఆడాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ కూడా సిక్సులతో విరుచుకుపడటంతో 25 బంతుల్లోనే 57 పరుగులు చేసి జట్టుకు 208 పరుగుల భారీ స్కోరును అందించాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. 50 కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు.

    అనంతరం ఛేదనకు దిగిన లక్నో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. రాహుల్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్ లాంటి అగ్రశ్రేణి బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మిడిల్ ఓవర్లో నికోలస్ పూరన్, చివర్లో  అర్షద్ ఖాన్ మెరుపులు మెరిపించినా చివరికి అవి అంతరాన్ని తగ్గించాయే తప్పా మ్యాచ్ ను గెలిపించలేకపోయాయి.

    ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు తలో వికెట్ తీసి ఢిల్లీని గెలిపించుకున్నారు. కానీ మిగతా ప్లేసులకు గట్టిపోటీ ఎదురవుతున్న సమయంలో ప్లే ఆప్ బెర్త్ దొరకడం కష్టమే.

    ఇప్పటికే చెన్నై జట్టు 14 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంచుకుంది. ఆర్సీబీ తో మ్యాచ్ లో గనక గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆప్స్ కు అర్హత సాధిస్తుంది. బెంగళూరు జట్టు అనూహ్యంగా అయిదు విజయాలు సాధించి ప్లే ఆప్ రేసులోకి వచ్చేసింది. ముఖ్యంగా చెన్నై పై గెలిస్తే టాప్ ఫోర్ ప్లేస్ లోకి వెళుతుంది. చెన్నై అవకాశాలు దెబ్బతింటాయి. సన్ రైజర్స్ గెలుపొటముల మీదనే మిగతా జట్ల ప్లే ఆప్ రేసులు కన్ ఫాం అయి ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    Cheetah : శంషాబాద్ లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలతో నిఘా

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ లో చిరుత సంచారం కలకలం...

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rishabh Pant : ప్రాణాలతో బయటపడుతానని అనుకోలేదు..రిషబ్ పంత్ ఎమోషనల్

    Rishabh Pant : దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతి వేగంతో...

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

    Jake Fraser McGurk : ఈ భీకర ప్లేయర్ బెంచ్ కే పరిమితం.. ఆసీస్ బోర్డుపై రికీ పాంటింగ్ విమర్శలు

    Jake Fraser McGurk : జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...