31.2 C
India
Thursday, July 4, 2024
More

    BRS – YCP : వైసీపీలో బీఆర్ఎస్ విలీనం.. రాజకీయాల్లో సంచలనం

    Date:

    BRS - YCP
    BRS – YCP

    BRS – YCP : ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని ఆలోచనతో బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. పేరు మార్చినంత మాత్రాన రాత మరదు కదా.. అలానే జరిగింది. పేరు మార్చినప్పటి నుంచి కేసీఆర్ కష్టాలు పడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది, మాటల్లో పస తగ్గింది, నేతల్లో అవినీతి పెరిగింది. వీటన్నింటి దరిమిలా దేశం మాట పక్కనుంచితే సొంత రాష్ట్రంలోనే ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది.

    ఎన్నికలకు ముందు కేసీఆర్ తన ‘కారు‘లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీల నాయకులకు ఆశ్రయం కల్పించారు. అంత ఓవర్ లోడ్ లో కూడా దూసుకుపోయిన కారు ఒక్క సారి ప్రజలు తిరస్కరించడంతో ఖాళీగా మారినా అడుగు ముందుకు వేయనని మొరాయించింది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన కారు పార్టీ తన మొదటి కార్యాలయాన్ని పొరుగు తెలుగు రాష్ట్రం ఏపీలో ఏర్పాటు చేసింది.

    ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ను అనౌన్స్ కూడా చేశారు. ఇక ఆంధ్రాలో కూడా జోరుగా రాజకీయాలు చేయచ్చు అనుకున్నాడు. కానీ, సొంత రాష్ట్ర అసెంబ్లీనే గెలవలేకపోయాడు. దీంతో కేసీఆర్ కలలు కళ్లలయ్యాయి. ఒకవేళ తెలంగాణలో మళ్లీ తన ప్రభుత్వమే వస్తే ఏపీలో తన అదృష్టం పరిష్కరించుకునేందుకు తొలి అడుగు వేసేవారేమో?

    తన మిత్ర పక్షమైన వైసీపీతో పొత్తుపెట్టుకొని కానీ, వైసీపీకి పరోక్ష మద్దతు ఇస్తూ కానీ ఆంధ్రా రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉబలాటపడ్డారు. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని ఏపీలో రాజకీయం చేద్దామనుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా లేకుండాపోయిన స్థితికి దక్కింది కేసీఆర్ కు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు కేసీఆర్ పోతే.. తాడేపల్లి ప్యాలస్ నుంచి బెంగుళూర్ ప్యాలస్ కు జగన్ వెళ్లిపోయారు.

    జాతీయ రాజకీయాల్లో తన మార్క్ వేయాలనుకుంటే కవిత లిక్కర్ కేసు అరెస్ట్ ద్వారా కేసీఆర్ జాతీయ స్థాయిలో మరోలా పరిచయమయ్యారు. తన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యి నెలలు గడుస్తున్నా కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉండడం వెనుక అర్థం ఏంటని, అర్ధాంగికారంగా భావించవచ్చా అని తెలంగాణ ప్రజలు సహేతుకంగా భావిస్తున్నారు.

    కేసీఆర్ మౌనం పార్టీకి శాపంలా మారింది. గతంలో రాష్ట్రం అంతా గులాబీ కండువాలే కనిపించే స్థితి నుంచి పార్టీ కార్యక్రమాల్లో తప్ప కనిపించని పరిస్థితి వచ్చింది. తెలంగాణలోనే బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి ఎదురైతే ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ జెండా పట్టుకునే నాయకుడు కనిపిస్తాడా? ఏపీలో తాను ఎవరి గెలుపు చూసేందుకు ఆరాటపడ్డారో, ఎవరి ఓటమి కావాలని ఆశపడ్డారో వీటికి విరుద్ధంగా ప్రజా తీర్పు రావడంతో ఏపీలో బీఆర్ఎస్ కారు షెడ్డుకే పరిమితమైంది.

    గతంలో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో సంబురాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే తెలంగాణలో సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ మెల్లి మెల్లిగా కబ్జా చేస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పేరు కూడా వినపడే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీని తన మిత్ర పక్షమైన వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణలో గెలిచిన వైసీపీ ఎంపీలను కేసీఆర్ కు గిఫ్ట్ ఇచ్చిన జగన్ రుణం తీర్చుకుంటారా? వేచి చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Keerthy Suresh : ఎనిమిదేళ్లుగా హద్దులు దాటని స్టార్ హీరోయిన్..  గ్లామర్ గేట్లు ఎత్తుతోందా? 

    Keerthy Suresh : ప్రస్తుతం  సినీ పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్లు తమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...