![Payal Ghosh](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/picture-113-1719489080.webp)
Payal Ghosh : బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ సినిమాల కంటే ఎక్కువ వివాదాల్లోనే ఉంటుంది. ఈమె తెలుగులో ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు సైడ్ క్యారెక్టర్ లో నటించింది. బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిపి వివాదాల్లో చిక్కుకుంది. తన ప్రియుడు ఇర్పాన్ పఠాన్ అని తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా తనను రేప్ చేసేందుకు ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఈమె ఎవరా అని అందరూ ఆలోచించడం మొదలెట్టారు.
అనంతరం క్రికెటర్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకుంటానని వన్డే ప్రపంచకప్ సందర్భంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. పాయల్ ఘోష్ కెరీర్ మొత్తం కేవలం 20 సినిమాల్లోనే నటించింది. కానీ ఇలా ఎందుకు తక్కువ సినిమాల్లో నటించాల్సి వచ్చిందో వివరంగా తెలిపింది. నేను కూడా 100 సినిమాల్లో నటించేదాన్ని కానీ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ. అవకాశం అని చెప్పి పక్కలో పడుకుంటేనే చాన్స్ లు ఇస్తారు. ఇలా నేను చేయలేదు. అందుకే ఇలా ఉన్నా అని బోల్డ్ కామెంట్స్ చేసింది.
కొన్ని రోజులకు గౌతం గంభీర్ నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడని తెలిపి షాక్ ఇచ్చింది.అయితే ఇర్పాన్ తో డేటింగ్ లో ఉన్నా కాబట్టి ఆ కాల్స్ కు స్పందించలేదని తెలిపింది. ఇర్పాన్ తో లవ్, మ్యారేజ్ నా కుటుంబానికి ఇష్టం లేకున్నా నేను ఇర్పాన్ ను మోసం చేయదలుచుకోలేదు. కానీ నన్ను ఇర్పాన్ పఠాన్ చీట్ చేశాడు. వారి కుటుంబానికి పరిచయం చేశాడని అయితే వారి తల్లిదండ్రులకు నేను నచ్చలేదని తర్వాత ఫొన్ చేసి చెప్పాడు. కొన్ని రోజులకు ఇర్పాన్ కు పెళ్లి అయిందని వాళ్ల చెల్లి ఫోన్ చేసి చెప్పింది. దీంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. నా గుండె బద్ధలైంది. ఇది జరిగి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదని తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది.