33.8 C
India
Monday, June 24, 2024
More

    Photo viral : ఎవరు రాశారో గానీ టీడీపీ ఘన విజయాన్ని ఇంత అద్భుతంగా ఎవరూ వర్ణించలేరు..ఫొటో వైరల్

    Date:

    Photo viral
    Photo viral

    Photo viral : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో రికార్డ్ మెజార్టీని సొంతం చేసుకుంది. మరోవైపు 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఐదేళ్లు తిరిగే సరికి అతి కష్టం మీద 11 సీట్లకే పరిమితం అయింది. ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో పోటీ చేశాయి. మొత్తంగా 164 సీట్లు గెలిచింది. ఇందులో టీడీపీ  135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. కూటమి 90శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో అదరగొట్టింది.

    కూటమి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడంతో టీడీపీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. ఈ సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఐదేళ్లుగా తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విజయం అందరిదీ అంటున్నారు.  ఈ క్రమంలోనే రేపు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు దుమ్మురేపుతున్నారు. చంద్రబాబు పనితనానికి, కార్యదక్షతకు, సమర్థతకు, ముందుచూపునకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

    తాజాగా ఎవరో అభిమాని ‘..ఈ విజయం’’ అనే శీర్షిక కింద ఓ కవిత అద్భుతంగా రాశాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ ఎవరు రాశారో గానీ చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే..

    …….ఈ విజయం

    కలిచొచ్చిన ‘కాపు’లది!
    భుజం తట్టి నిలబడ్డ ‘బీసీ’లది!
    ఆశీర్వదించిన ‘బ్రాహ్మణు’లది!
    వెన్నంటి నిలిచిన ‘వైశ్యుల’ది!
    నిజం వైపు నిలబడ్డ ‘రెడ్లు’ది!
    దరిచేరిన ‘దళితు’లది!
    గిరి గీచి నిలబడ్డ ‘గిరిజను’లది!
    ముందుకొచ్చిన ‘ముస్లిం’లది!
    అందరినీ కలుపుకుపోయిన ‘కమ్మ’ వారిది!
    అంతిమంగా ఆదరించి అండగా నిలబడ్డ ‘ఆడపడుచుల’ది!
    ఈ ఘన విజయం..!!

    అంటూ అద్భుతంగా కవితన రాసుకొచ్చాడు. ఇది చదివిన తెలుగు తమ్ముళ్లే కాదు సాధారణ జనాలు కూడా ఎంత బాగుందో కదా అని మెచ్చుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : జగన్ అప్పులకుప్ప చేసి వెళ్లాడు..చంద్రబాబుకు సవాల్ గా మారనుందా?

    Challenges to Chandrababu : ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి...

    AP Deputy CM : పవన్ కు డిప్యూటీ సీఎం పదవి? జనసేనానికి సముచిత గౌరవం

    AP Deputy CM : 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో...

    Babu Surity : బాబు ష్యూరిటి.. భవిష్యత్తుకు గ్యారెంటీ

    Babu Surity : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని...

    Former TANA President Satish : చంద్రబాబును పరామర్శించిన తానా మాజీ ప్రెసిడెంట్ సతీశ్

    Former TANA President Satish With Chandrababu : ‘స్కిల్ స్కాం’...