
Babu Surity : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని టిడిపి అధినేత చంద్ర బాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు. మహిళ లు కుటుంబ బాధ్యతలను మోస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారని మీ కష్టాన్ని చూసి ఒక అన్నలా సంక్షేమ కార్యక్ర మాలను మీకు అందేలా చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఆడబిడ్డ నిధి పేరుతో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయల నగదును నేరుగా మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుం టుందని బాబు హామీ ఇచ్చారు. ప్రస్తుత సమా జంలో గ్యాస్ సిలిండర్ కొనాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తీర్చేందుకు నెలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేసి తీరుతామని చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలియజేశారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు చెప్పని హామీలు కూడా ప్రజల కోసం ప్రవేశపెట్టేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని చంద్రబాబు తెలిపారు.