Prabhas Yogi Re Release : ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. తమ అభిమాన హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ రీరిలీజ్ సినిమాలకు కూడా ఫ్యాన్స్ నుండి భారీ స్పందన వస్తుంది. మరి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేసారు.. ఆ సినిమాలకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి.
అయితే మళ్ళీ ఈ మధ్య ఈ రీ రిలీజ్ లలో కూడా ఇంకో ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల ప్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతుండగా వాటి మీద కూడా ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఒక ప్లాప్ మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పుడు ప్రభాస్ రేంజ్ భారీ పెరగడంతో వరుసగా పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ సినిమాలను చేస్తున్నాడు. అవన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తున్న కలెక్షన్స్ మాత్రం భారీగా రాబడుతూ ఈయన తన క్రేజ్ ఏంటో నిరూపించు కుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయన నటించిన ప్లాప్ మూవీ యోగి సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
2007లో యోగి రిలీజ్ అయ్యి పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. అప్పట్లో యోగి సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 13 కోట్లు మాత్రమే రాబట్టి ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు అదే ప్లాప్ సినిమాను 4k టెక్నాలిజీతో ఆగస్టు 18న రీరిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన బిల్లా, వర్షం సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టగా ఇప్పుడు యోగి సినిమాను రిలీజ్ చేయనున్నారు.. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది..