Rashmi Gautam యాంకర్ రష్మీ గౌతమ్ గురించి అందరికి తెలుసు.. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది.. అయితే బుల్లితెర మీద రాణించిన అంత వెండితెర మీద రాణించలేక పోయింది. దీంతో ఈమె కేవలం బుల్లితెర మీద యాంకరింగ్, షోలు చేస్తూ ఇక్కడ స్టార్ డమ్ అనుభవిస్తుంది.
అయితే రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.. ఈమె యానిమల్ లవర్ అనే విషయం తెలిసిందే.. ఈమె ఎక్కడ యానిమల్స్ గురించి తప్పు జరిగిన స్పందిస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈమె మతపరమైన పోస్టులు కూడా చేస్తూ కొన్ని సార్లు ట్రోలింగ్ ఎదుర్కొంటుంది.. అయినా ఈమె పోస్టులు మాత్రం మానదు..
తాజాగా ఈ బ్యూటీ సెక్స్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.. ఈమె శృంగార పరమైన దృశ్యాలతో ఒక సైకిల్ లా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ”డేటింగ్ సంప్రదాయం వల్ల ఇదే జరుగుతుంది.. సంబంధాలు, వావి వరసల గురించి ఆలోచించకుండా ప్రతీ ఒక్కరు శృంగారాన్ని అనుభవిస్తూ బిజీగా ఉన్నారు.
మనల్ని దేవుడు సరైన మార్గంలో నడిచి నిజమైన ప్రేమని పొందండి అని పంపుతుంటే మనం రాక్షసత్వమైన శృంగార కోరికలతో ప్రేమని తిరస్కరిస్తూ విషపూర్తిమైన సంబంధాలు కొనసాగిస్తున్నాం” అంటూ ఈమె చేసిన పోస్ట్ పై చాలా మంది ఏకీభవిస్తున్నారు. ఈమె చెప్పిన పాయింట్స్ లో చాలా నిజం ఉందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.