![Dil Raju](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/01/Dil-Raju-1.jpg)
Dil Raju : తెలుగు లో ప్రస్తుతం దిల్ రాజు సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తుండగా.. ఆయన కూతురు కూడా నిర్మాత గా మారి బలగం మూవీని తీసింది. అది ఫుల్ సక్సెస్ అయింది. అయితే దిల్ రాజ్ కూతురు లవ్ మీ ఇఫ్ డేర్ అనే మూవీని నిర్మించింది. శనివారం మే 25 విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ విషయంలో దిల్ రాజు మౌనంగా ఉన్నాడు.
ది ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో ఆయన మాటలు రిజల్ట్ వచ్చాక తేలిపోయాయి. ఫ్యామిలీ స్టార్ దారుణంగా దెబ్బతినడంతో ఆయన తట్టుకోలేకపోయారు. దీంతో ఈ సారి సినిమా వచ్చే వరకు ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే లవ్ మీ మూవీ పై ఎంత నమ్మకం ఉన్నా సరే మాట్లాడటం లేదు.
లవ్ మీ మూవీకి నిర్మాతగా దిల్ రాజు కూతురు వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు మాత్రం ఈ సినిమా పై సైలెంట్ గా ఉన్నారు. బలగం మూవీ సమయంలో చూపిన విధంగానే ఈ మూవీకి కూడా సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. దిల్ రాజు మే 25 మాకు ఇంపార్టెంట్ డేట్ అని మూవీ టీంకు ఆల్ ది బెట్స్ అని చెప్పాడు. మహేశ్ బాబుతో ఎక్స్ వేదిక గా ఈ సినిమాలోని ఓ సాంగ్ ను రిలీజ్ చేయించారు. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆశించిన స్థాయిలో మ్యూజిక్ లేదనిపిస్తోంది.
ఈ మధ్య హారర్ కంటెంట్ సినిమాలు తెలుగులో సందడి చేశాయి. మా ఊరి పొలిమేర 2, మంగళవారం, గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఓం భీం బుష్, బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ ను పొందాయి. . మరి దెయ్యాన్ని ప్రేమించే కంటెంట్ తో రాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.