31.3 C
India
Wednesday, June 26, 2024
More

    CM Revanth Reddy : ఆ సీఎంకు ఇక ఢోకాలేదు

    Date:

    CM Revanth Reddy
    CM Revanth Reddy

    CM Revanth Reddy : తెలంగాణలో అధికార పగ్గాలు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారు. అభివృద్ధికి తగినవిదంగా మంత్రివర్గాన్ని నిర్మించుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రగతి కోసం మంత్రివర్గంతో చర్చలు. మరోవైపు అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశాలు నివహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఎన్నికల కమిషన్ అడ్డుగా నిలిచింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. వాటి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. కమిషన్ కూడా తన నిబంధనలను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిరంతం మంత్రులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా, సమావేశాలతో తీరిక లేకుండా ఉండనున్నారు.

    ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి భాద్యతలతోపాటు పీసీసీ పగ్గాలు కూడా తన చేతిలోనే ఉన్నవి. ఇప్పుడు అయన ముందు స్థానిక సంస్థల ఎన్నికల పోరు కూడా ఉంది. అందులో పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా సీఎం పైనే ఉంది. వాటితో పాటు కార్పొరేషన్ పదవుల పంపిణీ చేసే భాద్యత కూడా ఉంది. ఈ రెండు ప్రధానమైనవి కావడంతో సీఎం దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో పలు హామీలను కూడా ఇచ్చారు. ముక్యంగా రైతు రుణమాఫీ. ఈ పథకాన్ని ఆగష్టు 15 తేదీలోగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నిధుల వేటలో మంత్రి వర్గం ఉన్నది. అదేవిధంగా కులగణన చేసి తీరుతామని కూడా హామీ ఇచ్చారు. దీనిపై ఎక్కడ కూడా తేడా రాకుండా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది.

    జూన్ చివరి వారంలో లేదంటే జూలై మొదటి వారంలో అసెంబ్లీని సమావేశపరిచి అవకాశాలు కూడా ఉన్నాయి. సమావేశంలో ప్రతిపక్ష పార్టీలను కూడా ఎదుర్కొనే అంశాలపై మంత్రివర్గం తో చర్చించే అవకాశం కూడ ఉంది. బడ్జెట్ నిర్మాణం పై ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth Reddy : చంద్రబాబుతో పోటీ తథ్యం.. రేవంత్ రెడ్డి..

    Telangana CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఎన్నికైన...

    KTR vs Revanth Reddy: బొగ్గు గనుల వేలం.. రేవంత్ కేటీఆర్ ల మాటల తూటాలు

    KTR vs Revanth Reddy: హైదరాబాదులో సింగరేణి బొగ్గు గనుల వేలం...

    Pocharam Srinivas : బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత ఔట్.. కాంగ్రెస్ గూటికి మాజీ స్పీకర్

    Pocharam Srinivas : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో షాక్...