33.5 C
India
Monday, June 24, 2024
More

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    Date:

    West Godavari District
    West Godavari District

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ మింగడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు తొలగించారు. దీంతో ఆ చిన్నారికి ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకువెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ లో చిన్నారిని హుటాహుటిన తరలించారు.

    విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి వైద్యులు చిన్నారికి ఎక్స్ రే తీసి చూడగా, బ్యాటరీ కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ కనిపించింది. శస్త్ర చికిత్స అవసరం లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై చిన్నారిని ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదనీ, కొన్ని గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రి వైద్యులు శ్రీహర్ష, ఎం.ఎస్.గోపాలకృష్ణ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా బ్యాటరీని తొలగించారు.

    Share post:

    More like this
    Related

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభను భారీగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

    Ramoji Rao : మీడియా మొఘల్  రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...

    Balayya Birthday Celebrations : బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

    Balayya Birthday Celebrations : ప్రముఖ తెలుగు నటుడు, హిందూపురం హ్యాట్రిక్...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...