Veturi Sundararama Murthy Jayanthi : పాటకు పల్లవి ప్రాణమైతే.. ఆ పల్లవిలో భావానికి బంధువు వేటూరి. తెలుగు సాహిత్యానికి చక్రవర్తి. పాటల ప్రపంచానికి రచనలో మేటి సుందర మూర్తి, నవరస భరితమైన జానపద- సాంఘిక చిత్రాలకు ఆయన రాసిన పాటలు ఎల్లలు లేని సముద్రం లాంటివి.
ప్రేమికుల విరహతాపాలను, భార్యాభర్తల సరసాలను, అన్నదమ్ముల అనుబంధాన్ని, అక్కాచెల్లెళ్ల ఆత్మీయతను, స్నేహితుల అనురాగాన్ని, తల్లిదండ్రుల బంధాన్ని, పకృతిలో అందాలను పలకరిస్తూ, పువ్వులకు ప్రాణం పోసి.. పక్షులకే రాగాలు నేర్పిన గురువు. తెలుగు జాతికే తేనె పుట్టలాంటి ఆయన మదిలో మెదిలే తీయని సాహితీ మకరందాన్ని కలంతో చిందించిన చిరస్మరణీయుడు. తెలుగుదనం ఉన్నంత వరకు సినీ పాటలో చిరంజీవిగా ఉండే ఈ కళామతల్లి సరస్వతీ పుత్రుడు వేటూరికి జయంతి నివాళులు! స్వర్గంలో ఉన్న వేటూరి సుందరరామ్మూర్తి గారూ! మీకు జయంతి జోహార్లు!