25.4 C
India
Saturday, July 6, 2024
More

    Bigg Boss 7 Contestants : బిగ్ బాస్-7 టోటల్ లిస్ట్ ఇదే.. ఎంత మంది ఎంట్రీ ? వారెవరు అంటే?

    Date:

    This is the total list of Bigg Boss-7
    This is the total list of Bigg Boss-7

    Bigg Boss 7 Contestants :

    బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నిన్నటి నుండి బిగ్ బాస్ లవర్స్ కోసం మన తెలుగులో మరో సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈసారి స్టార్ట్ అయిన 7వ సీజన్ కూడా అట్టహాసంగా స్టార్ట్ చేసారు. ఆదివారం స్టార్ట్ అయినా ఈ బిగ్ బాస్ లో మొదటి రోజు 14 మంది ఎంట్రీ ఇచ్చారు. వారెవరంటే?

    ప్రియాంక : మొదటి కంటెస్టెంట్ గా నటి ప్రియాంక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పొట్టి పిల్ల అనే సాంగ్ తో ఈమె అందరిని మొదటి చూపులోనే ఆకట్టుకుంది.

    హీరో శివాజీ : రెండవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన హీరో శివాజీ కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దామని బిగ్ బాస్ కు వచ్చినట్టు తెలిపాడు.. బిగ్ బాస్ తోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు..

    సింగర్ దామిని : మూడవ కంటెస్టెంట్ గా దామిని ఎంట్రీ ఇచ్చింది. ఈమె తనదైన శైలిలో స్టైలిస్ట్ సాంగ్ పాడుతూ ఎంట్రీ ఇచ్చింది..

    ప్రిన్స్ యావర్ : నాలగవ కంటెస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చి తనదైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.. ఏకంగా సిక్స్ ప్యాక్ చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.

    నటి శుభ శ్రీ : ఈమె హీరోయిన్ రేంజ్ లో అందంగా కనిపించి తన డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

    షకీలా : ఒకప్పటి శృంగార తార షకీలా కూడా ఆరవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన కన్నీటి గాధ చెబుతూ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది.. తెలుగు ఆడియెన్స్ కు దగ్గర కావాలని బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది.

    కొరియోగ్రాఫర్ సందీప్ : ఏడవ కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ సందీప్ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన స్టైల్ డాన్స్ తో ఆకట్టుకున్నాడు.

    శోభా శెట్టి : కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి ఎనిమిదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.. టెలివిజన్ రమ్యకృష్ణన్ లా తాను మెప్పించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

    టేస్టీ తేజ : తొమ్మిదవ కంటెస్టెంట్ గా టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు మాజీ జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు యూట్యూబ్ లో వంటకాలను టేస్ట్ చేస్తూ ఫేమస్ అయ్యాడు.

    రతిక : సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ పదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తనకు నటిగా గుర్తింపు రాలేదని ఐడెంటిటీ కోసం బిగ్ బాస్ లోకి వచ్చినట్టు తెలిపింది.

    గౌతమ్ కృష్ణ : డాక్టర్ కమ్ యాక్టర్.. ఈయన నటన మీద ఉన్న మక్కువతో యాక్టింగ్ సైడ్ వచ్చానని తెలిపాడు.

    కిరణ్ రాథోర్ : నటి కిరణ్ రాథోర్ పలు భాషల్లో సినిమాల్లో నటించింది. ఇక ఈమె గ్యాప్ రావడంతో తానేంటో నిరూపించుకుపోవాలని బిగ్ బాస్ అయితే అందుకు కరెక్ట్ అనుకుని వచ్చానని తెలిపింది.

    రైతు పల్లవి ప్రశాంత్ : బిగ్ బాస్ లోకి మొట్టమొదటిసారిగా ఒక ఫార్మర్ ఎంట్రీ ఇచ్చాడు. సాధారణ రైతు, యూట్యూబర్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

    అమర్ దీప్ : బిగ్ బాస్ హౌస్ లోకి 14వ కంటెస్టెంట్ గా సీరియల్ హీరో అమర్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. తన భార్య తేజును ఈయన మిస్ అవుతున్నట్టు చెప్పాడు.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ పాలిట విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో

    Mahesh Babu New Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి – మ‌హేష్...

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related