24.4 C
India
Monday, July 8, 2024
More

    UK Election Results 2024 : యూకే ఎన్నికల ఫలితాలు 2024: కొంప ముంచిన రిషి సునాక్!

    Date:

    UK Election Results 2024
    UK Election Results 2024

    UK Election Results 2024 : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సారి అధికార కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమిని ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీ అధిక మెజారిటీతో విజయ కేతనాన్ని ఎగురవేస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఫలితాలు సైతం దీనికి అనుగుణంగా వెలువడుతున్నాయి.

    650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 326 సీట్లు సంపాదించుకోవాలి. భారతీయ మూలాలున్న రిషి సునాక్ సారథ్యంలో మొన్నటి వరకు కన్జర్వేటివ్ పార్టీ పాలన బాధ్యతలు చేపట్టింది. 2019 నాటి ఎన్నికల్లో ఈ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్య 344 కాగా లేబర్ పార్టీ 205తో  ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది.

    స్కాటిష్ నేషనల్ పార్టీ- 43, లిబరల్ డెమోక్రాట్స్- 15, డెమొక్రటిక్ యూనియనిస్ట్ – 7, సిన్ ఫెయిన్ పార్టీ- 7 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. బోరిస్ జాన్సన్, థాచర్ మే, జాన్ మేజర్, డేవిడ్ కామెరాన్, మార్గరెట్ థాచర్.. వంటి హేమాహేమీలను అందించిన పార్టీ కన్జర్వేటివ్.

    ఇప్పుడు ఫలితాలు తారుమారయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నారు. 410 స్థానాలతో లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కన్జర్వేటివ్స్‌కు దక్కేవి 131 సీట్లేనని పేర్కొన్నాయి.

    ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాకు అనుగుణంగానే ఉండబోతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత సండర్ లాల్ సౌత్ లో తొలి విజయాన్ని అందుకోబోతోంది లేబర్ పార్టీ. సర్ కీర్ స్టార్మర్ సండర్ లాల్ సౌత్ లో ఘన విజయం సాధించబోతున్నారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. పూర్తి మెజారిటీతో లేబర్ పార్టీ అధికారంలో వస్తే స్టార్మర్.. ప్రధాని అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.

    మొత్తం 81 స్థానాల్లో లేబర్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అదే సమయంలో కన్జర్వేటివ్స్ 7 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయ్యారు. మరో పార్టీ ప్రతిపక్ లిబరల్ డెమోక్రాట్లు 8 స్థానాలను గెలచుకుంది. ప్రస్తుత అధికార పార్టీ కన్జర్వేటివ్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది.

    Share post:

    More like this
    Related

    Hathras Incident : హత్రాస్ ఘటన.. ‘బోలేబాబా’ లాయర్ ఆరోపణలు

    Hathras Incident : హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్...

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NATS : భారత కాన్సుల్ జనరల్ తో నాట్స్ ప్రతినిధుల సమావేశం

    NATS : అట్లంటాలోని భారత కాన్సులేట్ ప్రధానాధికారి రమేశ్ బాబు లక్ష్మణ్...

    TANA : ఆకట్టుకున్న ‘తానా సాహిత్య సదస్సు’.. మరింత లోతుగా విశ్లేషించిన ప్రముఖులు..

    TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య...

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...