36.2 C
India
Friday, May 3, 2024
More

    ISRO Valarmathi : ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ వాయిస్ ఓవర్ లేడీ వలార్మతి

    Date:

    ISRO Valarmathi :
    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎన్నో అద్భుతాలు చేస్తోంది. సూర్య చంద్రుల రహస్యాలను చేధించే క్రమంలో చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాలు పంపి తన ప్రతిష్ట మరింత పెంచుకుంది. ఈనేపథ్యంలో ఇస్రో సాధించిన విజయాల్లో పాలు పంచుకున్న గొంతు మూగబోయింది. గుండె నొప్పితో లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె పేరు వలర్మాతి. ఇస్రో పంపించే ఉపగ్రహాల కౌంట్ డౌన్ లో అంకెలు లెక్కించే గొంతు ఆమెదే. దీంతో ఇకపై ఆమె గొంతు వినిపించదు.

    ఎన్నో రాకెట్లు పంపడంలో ఆమె గొంతు వినిపించేది. చంద్రయాన్ -3 ప్రయోగంలో కూడా ఆమె స్వరమే వినిపించింది. కానీ ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. గుండెపోటు రావడంతో చెన్నై ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచింది. వలర్మాతి చనిపోవడంతో ఇస్రోలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇస్రో సైంటిస్ట్ వలార్మతి మరణం అందరిని కలచివేసింది.

    1959లో వలర్మాతి తమిళనాడులోని అరియలూర్ లో జన్మించింది. కోయంబత్తూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచ్ లర్ ఆఫ్ ఇంజినీరింగ్, అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేశారు. 1984లో ఇస్రోలో చేరారు. ఇన్ శాట్ 2ఎ, ఐఆర్ఎస్ ఐసి, ఐఆర్ఎస్ ఐడి, టెన్ తో సహా అనేక మిషన్స్ లో ఆమె ప్రధాన భూమిక పోషించారు.

    2012లో విజయవంతంగా ప్రయోగించిన స్వదేశీ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రీశాట్ 1కి ఆమె ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్నారు. 2015లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆమె కావడం గమనార్హం. వలార్మతి మరణించడంతో ఇస్రోలో విషాద చాయలు అలుముకున్నాయి.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ISRO Scientist’s Salary : ఇస్రోలో శాస్త్రవేత్తల వేతనాలెంతో తెలుసా?

    ISRO Scientist's Salary : చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 లాంటి...

    Srihari Kota : రాకెట్ ప్రయోగాలకు శ్రీహరి కోటనే ఎందుకు? దీని వెనుక అసలు కారణం తెలుసా?

    Srihari Kota : ప్రపంచం యావత్తు ఇంత వరకు సాధించలేని ఘనత భారత...

    Aditya-L1 : నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన ఆదిత్య-ఎల్‌1

    Aditya-L1 : ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌...

    Aditya L1 Launch : ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి రెడీ.. అగ్రరాజ్యాల సరసన భారత్ కు చోటు

    Aditya L1 Launch : ఇంతవరకు మనం చంద్రుడిపై ప్రయోగానికి చంద్రయాన్...