
WhatsApp New Feature :
ప్రస్తుతం వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లు తెస్తోంది. సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. రోజురోజుకు కొత్త కొత్త తరహా ఫీచర్లు తీసుకొస్తోంది. దీని వల్ల వినియోగదారులకు లాభాలు కలగనున్నాయి. దీంతో వాట్సాప్ సరికొత్త విధానంతో ముందుకు వెళ్తోంది. ఇదివరకే చాలా రకాల ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సాప్ మరో ఫీచర్ తీసుకొచ్చింది.
క్లౌడ్ డ్రైవ్ బ్యాకప్ అవసరం లేకుండా పాత మొబైల్ నుంచి కొత్త మొబైల్ కు డేటాను ట్రాన్స్ ఫర్ చేయడం సులభతరం చేస్తోంది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఓ ఫీచర్ ను సిద్ధం చేస్తున్నారు. వాట్సాప్ లో ఈ మేరకు మార్పులు చేస్తున్నారు. కొత్త ఫీచర్ షేర్ ఇన్ తరహాలోనే జరుగుతుంది. రెండు మొబైళ్లకు నెట్ వర్క్ ఉంటే చాలు. డేటా సులభంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఫీచర్ ను వాట్సాప్ ద్వారా చూపించారు. డేటా ట్రాన్స్ ఫర్ కోసం whatsapp-chat transfer ఆప్షన్ లోకి వెళ్లాలి. అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది. దీంతో మొబైల్ లోని వాట్సాప్ యాప్ లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పాత మొబైల్ నుంచి డేటా మొత్తం కొత్త ఫోన్ లోకి వచ్చి చేరుతుంది.
ఈ విధానం ట్రాన్స్ ఫర్ షఏర్ ేసిన తరువాత చాట్ హిస్టరీ పూర్తిగా ఎన్ క్రిప్ట్ మోడ్ లో ఉంటుంది. సమాచారం ఇతరులకు వెళ్లే అవకాశం లేదు. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ తో వాట్సాప్ వినియోగదారులు ఇక మీదట ఫోన్లు మార్చినా డేటా ఎక్కడికి పోకుండా ఉంటుంది. వాట్సాప్ ఇలా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడంతో వినియోగదారులకు మరింత సేవలు సులభతరం కానున్నాయి.