WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే ఉంది.. అందుకే దీన్ని బీటా యూజర్స్ యూజ్ చేస్తున్నారు. తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తుంది. స్క్రీన్‌షాట్ల నుంచి మీ ఫొటోను రక్షించే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం, మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్‌షాట్‌ను సులభంగా తీసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్ అందుబాటులో కి వస్తే.. Android 2.24.4.25 అప్‌డేట్ కోసం తాజా వాట్సాప్ బీటాతో, పరిస్థితులు మారుతున్నాయి.
WabetaInfo ప్రకారం, వాట్సాప్ ట్రాకర్, అప్‌డేట్ ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్లను బ్లాక్ చేసే ఫీచర్‌ను రాబోతోంది. ప్రస్తుతం, గూగుల్ ప్లే స్టోరీ్ నుంచి ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటాను అప్‌డేట్ చేసే కొంత మందికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ త్వరలో, ఇది మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని మెటా తెలిపింది.
ఇది ఎలా పని చేస్తుంది?
ఎవరైనా మీ ప్రొఫైల్ ఫొటో స్క్రీన్ షాట్ తీయడానికి ప్రయత్నించినప్పుడు దీన్ని చేయలేరనే సందేశం వస్తుంది. ‘ఈ కొత్త ఫీచర్ గతంలో ఉన్న లొసుగును పరిష్కరిస్తూ, యజమాని అనుమతి లేకుండా ప్రొఫైల్ ఫొటోలను క్యాప్చర్ చేయకుండా, షేర్ చేయకుండా వినియోగదారులను నిరోధించడం ద్వారా రక్షణ కల్పిస్తుంది.’ అయినప్పటికీ, వారు మీ ప్రొఫైల్‌ను ఫొటో తీసేందుకు మరొక పరికరం లేదా కెమెరాను ఉపయోగించగలిగినప్పటికీ, ఈ అప్‌డేట్ వాటిని నేరుగా యాప్‌లో చేయకుండా నిలిపివేస్తుంది.
మీ గోప్యతపై మీకు మరింత నియంత్రణ కల్పిస్తుంది. మీ ప్రొఫైల్ ఫొటో మీ వ్యక్తి గతమైంది. దాన్ని ఎవరు చూడొచ్చు.. ఎవరు చూడలేరు మీరు నిర్ణయించుకోవచ్చు. స్క్రీన్‌షాట్‌లను బ్లాక్ చేయడం ద్వారా, WhatsApp మీ ఫొటోలను దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.