36.9 C
India
Monday, May 13, 2024
More

    Where is Telangana CM : కేసీఆర్ కనబడుట లేదు.. బెంగతో తెలంగాణ ప్రజలు.. పోస్టర్ వైరల్

    Date:

    Where is Telangana CM
    Where is Telangana CM

    Where is Telangana CM : తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. డేట్లను కూడా ఈసీ ప్రకటించి వేసింది. ఇక ఫిరాయింపులు, బుజ్జగింపులు, ప్రచారం మిగిలి ఉంది. ఈ సమయంలో తమ ప్రియతమ నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనిపించడం లేదు. దీంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది. నాయకుడు లేని నావ చందంగా ప్రస్తుతం పార్టీ ఉంది. ఆగస్ట్ లోనే అభ్యర్థుల ఫస్ట్  లిస్ట్ ప్రకటించిన సీఎం ఆ తర్వాత కనిపించకుండా పోయారు.

    అనారోగ్యంతో ఉన్నాడని కొన్ని రోజులు చెప్పినా ఇప్పటికీ కనిపించడం లేదు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కొడుకు కేటీఆర్ చూసుకుంటున్నారు. ఆయన కూడా ఇటీవల నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆరోగ్య పరిస్థితిపై వివరించాడు. అయితే ముఖ్యమంత్రి కావడంతో ప్రజలు ఆయన బాగోగులపై నిత్యం సమాచారం తెసుకుంటారు. ఈ నేపథ్యంలో చికిత్స తీసుకున్నాడా? తీసుకుంటే ప్రస్తుతం ఎలా ఉన్నాడు? షెడ్యూల్ వచ్చింది తమ ప్రియతమ ముఖ్యమంత్రిపై వెంటనే సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.

    ముఖ్యమంత్రి ‘కనబడుట లేదు’ అంటూ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ప్రతిపక్షాల పనా.. లేక వైరల్ రాయుళ్ల పనా తెలియడం లేదు గానీ తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. తమ సీఎం ఎక్కడంటూ చాలా రోజుల నుంచి ఆరాలు తీస్తున్నారు. ఎన్నికల వేల సీఎం కనిపించకుంటే అభ్యర్థుల్లో సైతం గుబులు మొదలైంది. సీఎంపై వెలసిన పోస్టర్లు, వాటి షేర్లు, కామెంట్లపై ప్రస్తుతం తెలంగాణలో సోషల్ మీడియా హాట్ గా నడుస్తోంది. సీఎం సాధ్యమైంత త్వరగా మీడియా ముందుకు రావాలని కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Jaiswaraajya TV Poll : తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరంటే?

    Jaiswaraajya TV Poll : ప్రపంచంలో ఎవరికైనా ‘ది బెస్ట్’ అంటే...