31.3 C
India
Saturday, April 27, 2024
More

    Jaiswaraajya TV Poll : తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరంటే?

    Date:

    Jaiswaraajya TV Poll
    Jaiswaraajya TV Poll, Best CM

    Jaiswaraajya TV Poll : ప్రపంచంలో ఎవరికైనా ‘ది బెస్ట్’ అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరు ఏ పని చేసినా ‘ది బెస్ట్’ అనిపించుకోవడానికే. జనాలు కూడా వివిధ రంగాల్లో ‘ది బెస్ట్’ ఎవరు అనేదానిపై ఇంట్రెస్ట్ చూపుతుంటారు. బెస్ట్ క్రికెటర్ ఎవరు? బెస్ట్ యాక్టర్ ఎవరు? బెస్ట్ హీరోయిన్ ఎవరు? చివరకు బెస్ట్ స్టూడెంట్ ఎవరు? ఇలా హ్యుమన్ సైకాలజీలో ‘బెస్ట్’కు బోలేడంత ప్రాధాన్యం ఉంది.

    ప్రముఖ మీడియా సంస్థ జైస్వరాజ్య టీవీ ‘‘తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరు? ’’ అనే ప్రశ్నతో జనాల అభిప్రాయాన్ని పోల్ ద్వారా తెలుసుకుంది. ఈ పోల్ లో ఏకంగా 2,04,000ల మంది పాల్గొనడం విశేషం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం జగన్ లలో జనాల దృష్టిలో ఎవరు బెస్టో ఎలాంటి సందేహాలు లేకుండా తేలిపోయింది.

    ఈ పోల్ లో బెస్ట్ సీఎంగా చంద్రబాబును 46శాతం మంది మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డిని 23శాతం మంది, ఆ తర్వాత కేసీఆర్ ను 18శాతం, చివర్లో జగన్ ను 13శాతం మంది బెస్ట్ సీఎం అని ఓట్ చేశారు. దీనిలో ఏపీ నేతలే తొలి, చివరి స్థానాల్లో ఉండడం గమనార్హం. ఇక ఈ పోల్ ను విశ్లేషిస్తే..

    ప్రజలను ఓటర్లుగా మాత్రమే భావించి పథకాలు అమలు చేస్తే ఎలా ఉంటుందో మాజీ సీఎం కేసీఆర్ ను చూస్తే తెలుస్తుంది. వాస్తవానికి రైతుబంధు, కేసీఆర్ కిట్ లాంటి మంచి పథకాలు తీసుకొచ్చినా.. ఆయన యువత, నిరుద్యోగుల మద్దతు మాత్రం కోల్పోయారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి అదే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఆహంకారం, కుటుంబ పాలన, అవినీతి కూడా పరాజయానికి పాలుపోశాయి.

    ఇక జగన్ ది అదే దారి.. ఐదేండ్లలో చేసిందేమైనా ఉందా అంటే.. ఒక్కటి చెప్పుకోలేని పరిస్థితి. ఓటర్ల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు తప్పా.. ప్రజల కోసం చేసే అభివృద్ధి, ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన..ఒక్కటీ ఆయన పాలనలో లేవు. ఒక్క పరిశ్రమా తేలేదు..ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు..వీటికి తోడు మూడు రాజధానుల పేరిట అయోమయం. మీ రాజధాని పేరు చెప్పమంటే.. ఇది మా రాజధాని అని చెప్పుకోలేని ధైన్యం జనాలది. ఆయన పనితీరు అలా ఉంది కాబట్టే లిస్ట్ లో చివర్లో నిలిచారు. ఇక రేవంత్ రెడ్డి మొన్ననే సీఎం అయ్యారు కాబట్టి..ఆయన పనితీరుపై ఇప్పుడే అంచనా వేయలేం.

    ఇక చంద్రబాబు నాయుడు 14ఏండ్లు సీఎంగా పనిచేసిన ఏకైక తెలుగు సీఎంగా పేరుగడించారు. ఇప్పటికీ ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీ బెస్ట్ సీఎంగా ఎవరి పేరైనా చెప్పాలంటే అందులో చంద్రబాబుదే అగ్రస్థానం. హైటెక్ సిటీ కట్టినా, హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ తెచ్చినా,  అమరావతి అభివృద్ధి, కియా వంటి కంపెనీలను తెచ్చినా..ఇవన్నీ చంద్రబాబు ముందుచూపు వల్లే. ఆయన వల్లే లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల యువత సాఫ్ట్ వేర్ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఓట్లు తెచ్చే సంక్షేమ పథకాలు కాదు.. ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబెట్టాలన్న ఆయన సిద్ధాంతమే జనాల్లో ఆయన్ను బెస్ట్ సీఎంగా నిలబెట్టింది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    Chandrababu : పవన్ కళ్యాణ్ పైసకు పనికిరాడు.. నోరుజారిన బాబు

    Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకరిపై...

    Chandrababu Strategy : అనపర్తి, దెందులూరు సీట్లలో చంద్రబాబు వ్యూహం అదుర్స్

    Chandrababu Strategy : ఏపీలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిని రేపుతున్నాయి....