Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం సలార్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వరుసగా బోల్తా పడటంతో ఇప్పుడు అందరి కళ్లు సలార్ మీదే ఉన్నాయి. దీనికి దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతో సహజంగానే అంచనాలు రెట్టింపయ్యాయి. కేజీఎఫ్ తో చిత్ర పరిశ్రమలోనే సంచలనాలు కలిగించిన దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కు పేరుంది. కేజీఎఫ్ రెండు భాగాలను హిట్ చేసిన దర్శకుడిగా మంచి పేరుంది.
దీంతోనే ప్రభాస్ కు సలార్ మంచి పేరు తీసుకురావడం ఖాయమని అందరు నమ్ముతున్నారు. సలార్ కూడా రెండు భాగాలుగా తీస్తున్నారు. మొదటి భాగం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సాగుతున్నాయి. దీంతో సినిమా గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడొద్దని సినిమా యూనిట్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎవరు కూడా సలార్ గురించి మాట్లాడటం లేదు.
సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. అత్యుత్సాహంతో సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ చేయొద్దనే నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో సలార్ గురించి ఏ విషయం కూడా బయటకు రావడం లేదు.
సినిమాలో నటిస్తున్న నటీనటులు ఎవరు కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని షరతు విధించింది. ట్రైలర్ విడుదల అయ్యే వరకు సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో, వెబ్ సైట్లకు, చానల్స్ తో మాట్లాడొద్దని సూచించింది. సలార్ మూవీ గురించి ఏ విషయం కూడా బయటకు రావడం లేదు. హీరోహీరోయిన్లు కూడా ఎక్కడ మాట్లాడొద్దని నిబంధన విధించారు.