
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికి పోయేలా చేసి దేశం నుండి పారిపోయేలా చేసిన ఘనత భారతీయులది. స్వాతంత్య్రం మా జన్మహక్కు అంటూ నినదించిన భారతీయులు బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. భారతీయుల సుదీర్ఘ పోరాటానికి బ్రిటీష్ పాలకులు తలవంచక తప్పలేదు. అలా బానిస సంకెళ్లను తెంచుకున్న భారతదేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుతూ స్వపరిపాలనకు సిద్ధమైంది. 1947 ఆగష్టు 15 న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించినప్పటికి , మన దేశ పరిపాలన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జనవరి 26, 1950.
మొట్టమొదటి సారిగా భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ , ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ల సారథ్యంలో ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున పరేడ్ నిర్వహించారు. ఆ కాలంలోనే భారీ ఎత్తున పరేడ్ నిర్వహించి , దేశ సంస్కృతి….. సంప్రదాయాలను వెల్లడించేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ప్రధాని నెహ్రూ ఓ సామాన్య వ్యక్తిలా అందరితో కలిసి సందడి చేసిన తీరు చూడముచ్చటగా ఉంది. ఆనాటి గణతంత్ర దినోత్సవ వేడుకల వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.