జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు షాక్ ఇచ్చాడు ఆ రాష్ట్ర గవర్నర్. అక్రమ మైనింగ్ వ్యవహారంలో హేమంత్ సోరెన్ ప్రమేయం ఉన్నట్లుగా ఆధారాలు లభించడంతో సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కు సూచన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దాంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు గవర్నర్.
దాంతో హేమంత్ సోరెన్ మరో ఆరు నెలల కాలంలో అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. జార్ఖండ్ లో ఆరు నెలల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలిస్తే యధావిధిగా ముఖ్యమంత్రిగా కొనసాగనున్నాడు. అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చాకు యూపీఏ మిత్రపక్షాల మద్దతు ఉన్నందున సోరెన్ కు ఇప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదు. ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఆరు నెలల పాటు రాజ్యాంగ బద్దమైన పదవిలో కొనసాగే హక్కు రాజ్యాంగం కల్పించింది.
Breaking News