31.1 C
India
Wednesday, June 26, 2024
More
    Home Blog Page 1527

    ప్రభాస్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా

    pawan kalyan green signal to young director sujit
    pawan kalyan green signal to young director sujit
    pawan kalyan green signal to young director sujit

      pawan kalyan green signal to young director sujit

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. డార్లింగ్ ప్రభాస్ తో ” సాహో ” వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ కు అవకాశం ఇచ్చాడు. సుజిత్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కు నచ్చడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నాడు. ఆమేరకు అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ఇది యువ దర్శకులు సుజీత్ కు బంగారం లాంటి అవకాశం అనే చెప్పాలి……. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆశగా ఎదురు చూసే దర్శకులు చాలా మంది ఉంటారు మరి.

    పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు చిత్రాలు కమిట్ అయి ఉన్నాడు. వాటినే సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నాడు. దాంతో ఏ సినిమా కూడా పూర్తి కావడం లేదు. ఇక హరిహర వీరమల్లు చిత్రం అయితే సీరియల్ లాగే సాగిపోతుంది. ఇప్పటికి సగం మాత్రమే పూర్తయ్యింది ఆ సినిమా. మిగతా సగం ఎప్పుడు పూర్తి అవుతుందో.

    ఇలాంటి పరిస్థితుల్లో సుజిత్ తో సినిమా అంటే ప్రకటన అయితే ఇస్తారేమో కానీ అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళాలి . అలాగే ఎప్పుడు పూర్తి కావాలి అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఒకవైపు హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ల సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించారు మరి.

    సీబీఐకి లేఖ రాసిన కవిత

    Kavitha wrote a letter to CBI
    Kavitha wrote a letter to CBI
    Kavitha wrote a letter to CBI
    Kavitha wrote a letter to CBI

    ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా సీబీఐకి లేఖ రాసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించిన ఫిర్యాదుతో పాటుగా ఎఫ్ ఐ ఆర్ కాపీలను కూడా అందించాలని , అలాగే ఇతర డాక్యుమెంట్లు కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరింది. ఆ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత మాత్రమే నేను వివరణ ఇచ్చే తేదీని ఖరారు చేయాలని కూడా కోరింది కవిత. ఆమేరకు సీబీఐ అధికారి అలోక్ కుమార్ ను కోరింది కవిత. మరి కవిత లేఖ పై సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. మాములుగా అయితే డిసెంబర్ 6 న కవితను విచారణ చేస్తామని ప్రకటించింది సీబీఐ. కవిత లేఖ వల్ల ఏమైనా మార్పులు జరుగుతాయా చూడాలి.

    Kavitha wrote a letter to CBI
    Kavitha wrote a letter to CBI

    Chandramohan Emotional Interview Superstar Krishna Lives On

    Chandramoham Emotional Interview Superstar Krishna Lives On
    Chandramoham Emotional Interview Superstar Krishna Lives On

    రానా తమ్ముడు హీరోగా నిలబడతాడా ?

    will rana brother abhiram proves his talent?
    will rana brother abhiram proves his talent?
    will rana brother abhiram proves his talent?
    will rana brother abhiram proves his talent?

    అగ్ర నిర్మాతలు దగ్గుబాటి రామానాయుడు మనవడు , సురేష్ బాబు తనయుడు , రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ” అహింస ”. ప్రముఖ దర్శకులు తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది.

    ఈ నెలలోనే అహింస చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిరామ్ సరసన గీతిక నటిస్తున్న ఈ చిత్రంపై అభిరామ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ – ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    ఇక అభిరామ్ విషయానికి వస్తే ……… వారసుల రాజ్యం లోకి మరో వారసుడు వస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది వారసులు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారసత్వంతో వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొంతమందే. దాంతో రానా తమ్ముడు అభిరామ్ హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా ? అనే ఆసక్తి నెలకొంది. సత్తా చాటితే హీరోగా నిలబడతాడు లేదంటే షరామామూలే కదా ! మరి ఈ హీరో ఏ గట్టున ఉంటాడో చూద్దాం.

    షూటింగ్ లో జాయిన్ అయిన మహేష్

    Mahesh babu in acting mode
    Mahesh babu in acting mode
    Mahesh babu in acting mode
    Mahesh babu in acting mode

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఈరోజు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. నవంబర్ 15 న కృష్ణ మరణించడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు మహేష్ బాబు. ఈ ఏడాది ప్రథమార్థంలో అన్నయ్య రమేష్ బాబు మరణించగా సెప్టెంబర్ లో తల్లి ఇందిరాదేవి మరణించింది. వాటి నుండి కోలుకోకముందే తండ్రి మరణించడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

    తండ్రి కర్మకాండలు నిర్వహించిన అనంతరం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి షూటింగ్ కు వెళితే కాస్త ఉపశమనం లభిస్తుందని భావించిన మహేష్ బాబు తాను నటిస్తున్న కొత్త సినిమా కోసం సెట్స్ కు వెళ్ళాడు. వర్క్ మోడ్ లో ఉన్నాను అంటూ ఏకంగా ఓ ఫోటోను కూడా మీడియాకు విడుదల చేసాడు మహేష్ బాబు.

    మహేష్ ట్రెండీ లుక్ వైరల్ గా మారడం ఖాయం….. అలా ఉంది మరి ఈ లుక్కు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు మహేష్ . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ గతనెలలో 3 రోజుల పాటు జరిగింది. అయితే ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగకపోవడంతో ఆపేసారు . కట్ చేస్తే తండ్రి కృష్ణ మరణించాడు. దాంతో నవంబర్ లో షూటింగ్ చేయలేకపోయాడు. ఇప్పుడు మనసును కుదుట పరుచుకోవడానికి లొకేషన్ కు వెళితే ఆ జ్ఞాపకాలు వెంటాడని భావించాడట. దాంతో ssmb 28 స్టార్ట్ అయ్యింది.

    సల్మాన్ ఖాన్ ఓ సైకో అంటున్న హీరోయిన్

    salman khan ex girl friend somy ali sensational comments
    salman khan ex girl friend somy ali sensational comments
    salman khan ex girl friend somy ali sensational comments
    salman khan ex girl friend somy ali sensational comments

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక సైకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఒకప్పటి హీరోయిన్ సోమీ అలీ . ”సల్మాన్ ఓ పిరికిపంద , సిగరెట్ల తో కాల్చడం , శారీరకంగా వేధించడం అతడి నైజం” అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సోమీ అలీ. అయితే కొద్దిసేపటికే ఏమైందో ఏమో కానీ ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఆ పోస్ట్ చూసిన వాళ్ళు దాన్ని వైరల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో బాలీవుడ్ లో మరోసారి సంచలనంగా మారింది ఈ వార్త.

    పాకిస్థాన్ కు చెందిన సోమీ అలీ సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉంది కొన్నాళ్ళు. అయితే మొదట్లో బాగానే ఉండేవాడట. కానీ తర్వాత అతడిలోని సైకో బయటపడ్డాడని , సిగరెట్ తో కాల్చడం , కొట్టడం , హింసించడం చేస్తూ శునకానందం పొందేవాడని , అలాంటి వాడ్ని ఏం చేసినా పాపం లేదు అంటూ ఆరోపణలు చేస్తోంది.

    90 వ దశకంలో సల్మాన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది సోమీ అలీ. అయితే అతడికి బ్రేకప్ చెప్పాక ఇండియా వదిలి అమెరికా వెళ్ళింది. అక్కడే స్థిరపడింది. అప్పట్లో సోమీ అలీ భయపడి పోవడానికి సల్మాన్ ఖాన్ కారకుడని గుసగుసలు వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆరోపణలు చేస్తోంది.

    పెళ్లి లో రచ్చ రచ్చ చేసిన ప్రగతి ఆంటీ

    Actress pragathi mass dance goes viral
    Actress pragathi mass dance goes viral
    Actress pragathi mass dance goes viral
    Actress pragathi mass dance goes viral

    చెన్నై లో జరిగిన పెళ్లిలో రచ్చ రచ్చ చేసింది ప్రగతి ఆంటీ. 80- 90 వ దశకంలో తమిళంలో హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించిన ఈ భామ ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. కట్ చేస్తే ఇద్దరు పిల్లలు అయ్యాక హీరో తల్లి పాత్రల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. స్టార్ హీరోలకు తల్లిగా , అత్తగా నటిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది తన గ్లామర్ తో.

    తాజాగా చెన్నై లో బంధువుల పెళ్లిలో రచ్చ రచ్చ చేసింది. ఏకంగా డోలు మీద కూర్చొని తీన్మార్ స్టెప్పులు వేస్తూ పిచ్చెక్కించింది. 46 ఏళ్ల వయసులో డోలు మీద కూర్చొని ప్రగతి ఆంటీ డ్యాన్స్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ అంటున్నారు కుర్రాళ్ళు. ప్రగతి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట చేసింది. ఇంకేముంది ఆ వీడియో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రగతి ఆంటీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రగతి డ్యాన్స్ వీడియోల కోసం అలాగే ఆమె చేసే ఎక్సర్ సైజ్ కోసం కుర్రాళ్ళు ఆశగా ఎదురు చూస్తుంటారు. సినిమాల్లో క్లాస్ బయట మాస్ …… దాంతో ప్రగతికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తాజాగా తనకు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలను అంగీకరిస్తోంది ఈ భామ.

     

    View this post on Instagram

     

    A post shared by Pragathi Mahavadi (@pragstrong)

    నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ దంపతులు

    YS Jagan couple who blessed the newlyweds
    YS Jagan couple who blessed the newlyweds
    YS Jagan couple who blessed the newlyweds
    YS Jagan couple who blessed the newlyweds

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత సహాయకుడు డి. రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల లోని ఎస్ సి ఎస్ ఆర్ గార్డెన్స్ లో హేమలత – గంగాధర్ ల వివాహం జరుగగా సీఎం జగన్ తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి విచ్చేయడం విశేషం.

    ముఖ్యమంత్రి సతీసమేతంగా తన కుమార్తె వివాహానికి హాజరు కావడంతో రవిశేఖర్ కుటుంబం పరవశించిపోయింది. రవిశేఖర్ వైఎస్ జగన్ వద్ద పీఏ గా పని చేస్తున్నాడు. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కావడంతో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

    చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

    chiranjeevi emotional tweet on charan 
    chiranjeevi emotional tweet on charan 
    chiranjeevi emotional tweet on charan 
    chiranjeevi emotional tweet on charan

    మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేసాడు. తన కొడుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ను చూస్తే గర్వంగా ఉందని ట్వీట్ చేసాడు. నిన్నటి రోజున దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన NDTV అవార్డుల వేడుకలో పాల్గొన్నాడు చరణ్. ప్రఖ్యాత ఎన్డీటీవీ చరణ్ ను #FutureofYoungIndia అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు అందుకోవడానికే హైదరాబాద్ నుండి నిన్న ఢిల్లీ వెళ్ళాడు చరణ్.

    తన కొడుకు చరణ్” ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ” ఎన్డీటీవీ ఇచ్చిన అవార్డును అందుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. నాకు గర్వంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు చిరు. ఎదిగిన కొడుకును చూస్తే ఎవరికైనా ఆనందమే ……. పైగా తండ్రి పేరు నిలబెట్టే కొడుకు అంటే మరీ మరీ ఇష్టం.

    మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన చరణ్ తక్కువ సమయంలోనే తన ప్రతిభతో స్టార్ హీరో అయ్యాడు. ఇక ఇప్పుడేమో ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాంతో తన వారసుడ్ని చూసి మురిసిపోతున్నాడు చిరంజీవి. తాజాగా చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలోని పాట కోసం ఇటీవలే న్యూజిలాండ్ వెళ్ళొచ్చాడు.

    భారత్ తో కలిసి పనిచేస్తామని చైనాకు వార్నింగ్ ఇచ్చిన అమెరికా

    America's warning on china's objections
    America's warning on china's objections
    America's warning on china's objections
    America’s warning on china’s objections

    భారత్ తో కలిసి పనిచేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేసింది అగ్రరాజ్యం అమెరికా. తాజాగా భారత్ – అమెరికా సంయుక్తంగా ఉత్తరాఖండ్ లోని చైనా సరిహద్దు ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేసింది. భారత్ కు పక్కలో బల్లెమైన చైనా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దాంతో భారత్ 1993, 96 ఒప్పందాలను తుంగలో తొక్కి సైనిక విన్యాసాలు చేయడం ఏంటని మండిపడింది.

    అయితే చైనా అభ్యంతరాలను భారత్ అదే ధోరణిలో తిప్పికొట్టింది. ఇది భారత్ లో చేసిన సైనిక విన్యాసాలని , గతంలో మీరు కూడా అమెరికాతో కలిసి చేసినప్పుడు ఈ విషయం తెలియదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అమెరికా కూడా చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది……. భారత్ కు అండగా ఉంటామని స్పష్టం చేసింది. అమెరికా – భారత్ ల మధ్య 157 బిలియన్ డాలర్ల వాణిజ్య సంబంధాలు నెలకొన్నాయని సంతోషం వ్యక్తం చేసింది అమెరికా.