పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. డార్లింగ్ ప్రభాస్ తో ” సాహో ” వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ కు అవకాశం ఇచ్చాడు. సుజిత్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కు నచ్చడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నాడు. ఆమేరకు అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ఇది యువ దర్శకులు సుజీత్ కు బంగారం లాంటి అవకాశం అనే చెప్పాలి……. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆశగా ఎదురు చూసే దర్శకులు చాలా మంది ఉంటారు మరి.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు చిత్రాలు కమిట్ అయి ఉన్నాడు. వాటినే సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నాడు. దాంతో ఏ సినిమా కూడా పూర్తి కావడం లేదు. ఇక హరిహర వీరమల్లు చిత్రం అయితే సీరియల్ లాగే సాగిపోతుంది. ఇప్పటికి సగం మాత్రమే పూర్తయ్యింది ఆ సినిమా. మిగతా సగం ఎప్పుడు పూర్తి అవుతుందో.
ఇలాంటి పరిస్థితుల్లో సుజిత్ తో సినిమా అంటే ప్రకటన అయితే ఇస్తారేమో కానీ అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళాలి . అలాగే ఎప్పుడు పూర్తి కావాలి అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఒకవైపు హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ల సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించారు మరి.