
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక సైకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఒకప్పటి హీరోయిన్ సోమీ అలీ . ”సల్మాన్ ఓ పిరికిపంద , సిగరెట్ల తో కాల్చడం , శారీరకంగా వేధించడం అతడి నైజం” అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సోమీ అలీ. అయితే కొద్దిసేపటికే ఏమైందో ఏమో కానీ ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఆ పోస్ట్ చూసిన వాళ్ళు దాన్ని వైరల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో బాలీవుడ్ లో మరోసారి సంచలనంగా మారింది ఈ వార్త.
పాకిస్థాన్ కు చెందిన సోమీ అలీ సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉంది కొన్నాళ్ళు. అయితే మొదట్లో బాగానే ఉండేవాడట. కానీ తర్వాత అతడిలోని సైకో బయటపడ్డాడని , సిగరెట్ తో కాల్చడం , కొట్టడం , హింసించడం చేస్తూ శునకానందం పొందేవాడని , అలాంటి వాడ్ని ఏం చేసినా పాపం లేదు అంటూ ఆరోపణలు చేస్తోంది.
90 వ దశకంలో సల్మాన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది సోమీ అలీ. అయితే అతడికి బ్రేకప్ చెప్పాక ఇండియా వదిలి అమెరికా వెళ్ళింది. అక్కడే స్థిరపడింది. అప్పట్లో సోమీ అలీ భయపడి పోవడానికి సల్మాన్ ఖాన్ కారకుడని గుసగుసలు వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆరోపణలు చేస్తోంది.