
అగ్ర నిర్మాతలు దగ్గుబాటి రామానాయుడు మనవడు , సురేష్ బాబు తనయుడు , రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ” అహింస ”. ప్రముఖ దర్శకులు తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది.
ఈ నెలలోనే అహింస చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిరామ్ సరసన గీతిక నటిస్తున్న ఈ చిత్రంపై అభిరామ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ – ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక అభిరామ్ విషయానికి వస్తే ……… వారసుల రాజ్యం లోకి మరో వారసుడు వస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది వారసులు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారసత్వంతో వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొంతమందే. దాంతో రానా తమ్ముడు అభిరామ్ హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా ? అనే ఆసక్తి నెలకొంది. సత్తా చాటితే హీరోగా నిలబడతాడు లేదంటే షరామామూలే కదా ! మరి ఈ హీరో ఏ గట్టున ఉంటాడో చూద్దాం.