భారత్ తో కలిసి పనిచేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేసింది అగ్రరాజ్యం అమెరికా. తాజాగా భారత్ – అమెరికా సంయుక్తంగా ఉత్తరాఖండ్ లోని చైనా సరిహద్దు ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేసింది. భారత్ కు పక్కలో బల్లెమైన చైనా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దాంతో భారత్ 1993, 96 ఒప్పందాలను తుంగలో తొక్కి సైనిక విన్యాసాలు చేయడం ఏంటని మండిపడింది.
అయితే చైనా అభ్యంతరాలను భారత్ అదే ధోరణిలో తిప్పికొట్టింది. ఇది భారత్ లో చేసిన సైనిక విన్యాసాలని , గతంలో మీరు కూడా అమెరికాతో కలిసి చేసినప్పుడు ఈ విషయం తెలియదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అమెరికా కూడా చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది……. భారత్ కు అండగా ఉంటామని స్పష్టం చేసింది. అమెరికా – భారత్ ల మధ్య 157 బిలియన్ డాలర్ల వాణిజ్య సంబంధాలు నెలకొన్నాయని సంతోషం వ్యక్తం చేసింది అమెరికా.