31.1 C
India
Wednesday, June 26, 2024
More
    Home Blog Page 1589

    AMIT SHAH: పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా

    amit-shah-in-the-parade-grounds
    amit-shah-in-the-parade-grounds
    amit-shah-in-the-parade-grounds
    amit-shah-in-the-parade-grounds

    కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా హాజరవ్వడం విశేషం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరుపున ఏ మంత్రి కూడా పాల్గొనలేదు.

    ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కిషన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించాడు. అమిత్ షా కు ఘనస్వాగతం లభించింది. కర్ణాటక , మహారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు తమ విద్యలను అమిత్ షా ముందు ప్రదర్శించారు. అంతకుముందు అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

    TELANGANA LIBERATION DAY:తెలంగాణకు విముక్తి లభించింది ఈరోజే !

    telangana-liberation-day-telangana-got-liberated-today
    telangana-liberation-day-telangana-got-liberated-today
    telangana-liberation-day-telangana-got-liberated-today
    telangana-liberation-day-telangana-got-liberated-today

    సెప్టెంబర్ 17 ……. తెలంగాణకు విముక్తి లభించిన రోజు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజు. అదేంటి భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చింది కదా ! ఇదే కదా డౌట్ . భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు అనగానే టక్కున ఆగస్టు 15 అని చెబుతారు. కానీ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 న స్వాతంత్య్రం లభించింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా …….

    నైజాం ప్రాంతం అంటే తెలంగాణతో పాటుగా కర్ణాటక లోని కొన్ని జిల్లాలు అలాగే మహారాష్ట్ర లోని కొన్ని జిల్లాలు కలిపి హైదరాబాద్ ను రాజధానిగా చేసుకొని నైజాం నవాబు పరిపాలించాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ భారత్ లో మేము విలీనం కాము , స్వతంత్య్ర దేశంగా ఉంటాం లేదంటే పాకిస్థాన్ లో కలుస్తామని స్పష్టం చేసారు అప్పటి నైజాం నవాబ్.

    అంతేకాకుండా నైజాం పాలనలో రజాకార్ల అరాచకాలు చెప్పనలవి కావు. మహిళలపై అత్యాచారాలు చేయడం , మనుషులను దారుణంగా చంపడం చేస్తూండేవాళ్లు. దాంతో నైజాం పాలనకు అంతం పలకడానికి అలాగే ఖాసీం రజ్వీ సాగిస్తున్న మారణకాండకు ముగింపు పలకాలని భావించారు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.

    దాంతో సైనిక చర్యకు పూనుకున్నారు. హైదరాబాద్ ని నలువైపులా చుట్టుముట్టి రజాకార్లతో భీకర పోరాటం చేసారు భారత సైనికులు. ఈ సైనిక చర్యలో భారత సైన్యం 66 మంది చనిపోయారు. 97 మంది గాయపడ్డారు. ఇక 490 మంది రజాకార్లు చనిపోగా 122 మంది గాయపడ్డారు. తెలంగాణలో దారుణ మారణకాండ సాగించిన ఖాసీం రజ్వీని అరెస్ట్ చేసి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. జైలు నుండి విడుదల అయ్యాక పాకిస్థాన్ వెళ్లి అక్కడే చనిపోయాడు ఖాసీం రజ్వీ. ఇక సైనిక చర్యతో నైజాం నవాబు తలవంచాడు. అదే సెప్టెంబర్ 17 . దాంతో ఈరోజుని విమోచన దినోత్సవం అని కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ ఉత్సవాలు పోటీగా నిర్వహిస్తోంది. 

    BRAHMASTRA: 300 కోట్లు వసూల్ చేసిన బ్రహ్మాస్త్ర

    brahmastra-grossed-300-crores
    brahmastra-grossed-300-crores
    brahmastra-grossed-300-crores
    brahmastra-grossed-300-crores

    అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ , నాగార్జున , షారుఖ్ ఖాన్ , రణబీర్ కపూర్ , అలియా భట్ , మౌనీ రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే బాయ్ కాట్ ట్రెండింగ్ కూడా అయ్యింది.

    అయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. దాంతో మొదటి వారంలో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి వారం పూర్తయ్యేసరికి 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో లాంగ్ రన్ లో మరో 100 కోట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు . అంటే ఈ సినిమాను నిర్మించిన నిర్మాతకు అలాగే బయ్యర్లకు లాభాలు రావాలంటే కనీసం 600 కోట్లు వసూల్ కావాలి.

    ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే 600 కోట్ల వసూళ్లు రావడం కష్టమే ! అంటే ఈ సినిమాను కొన్న బయ్యర్లు నష్టపోవడం ఖాయం. కాకపోతే నిర్మాతకు మాత్రం లాభాలు వచ్చాయి. శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , ఓటీటీ రైట్స్ రూపంలో భారీ మొత్తాలే వచ్చాయి నిర్మాతలకు. కథ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయని , దాంతో ప్రేక్షకులను అలరించడం లేదని వాపోతున్నారు. 

    DISHA PATANI: క్లీవేజ్ షోతో పిచ్చెక్కించిన దిశా పటాని

    disha-patani-went-crazy-with-her-cleavage-show
    disha-patani-went-crazy-with-her-cleavage-show
    disha-patani-went-crazy-with-her-cleavage-show
    disha-patani-went-crazy-with-her-cleavage-show

    హాట్ భామ దిశా పటాని తాజాగా చేసిన క్లీవేజ్ షో పిచ్చెక్కించేలా ఉంది. ఎద అందాలన్నీ బయటకు తొంగి చూస్తుంటే ఆ సుందర దృశ్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. దిశా పటాని ఎద అందాలు పొంగుకొస్తుంటే ……. వయ్యారంగా నడుస్తుంటే ఆ కదలికలకు ఎదసంపద మరింత వయ్యారంగా సయ్యాట ఆడుతుంటే సొగసు చూడతరమా ! దిశా పటాని సొగసు చూడతరమా ! అంటూ గుడ్లప్పగించి చూస్తూ ఉండటమే తప్ప మరో మాట రాదంటే నమ్మండి.

    ఈ భామ పోతున్న హొయలకు పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్ళు. ఊహాలోకాల్లో తేలియాడుతూ తమ ఊహలో దిశా పటానిని ఊహించుకుంటూ స్వర్గలోకాల్లో తేలిపోతున్నారు. క్లీవేజ్ అందాలు కుర్రాళ్లను పిచ్చెక్కించడానికి మాత్రమే ఇలా కలరింగ్ ఇస్తోంది ఈ హాట్ భామ.

    దిశా పటాని తెలుగులో లోఫర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం సత్తా చాటుతూనే ఉంది. సినిమా కెరీర్ బాగానే ఉన్నప్పటికీ ప్రేమలో మాత్రం బ్రేకప్ అయి కాస్త డిస్ట్రబ్ అయ్యిందట. 

    PRABHAS- AMIT SHAH: ప్రభాస్ తో భేటీ కానున్న అమిత్ షా

    prabhas-amit-shah-amit-shah-is-going-to-meet-prabhas
    prabhas-amit-shah-amit-shah-is-going-to-meet-prabhas
    prabhas-amit-shah-amit-shah-is-going-to-meet-prabhas
    prabhas-amit-shah-amit-shah-is-going-to-meet-prabhas

    కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా డార్లింగ్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకలలో పాల్గొనడానికి ఈరోజు సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈరోజు ఇక్కడే బస చేయనున్నారు. రేపు సెప్టెంబర్ 17 న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలలో పాల్గొననున్నారు.

    అయితే ఆ వేడుకల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అలాగే వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు. దాంతో కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి ఇలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

    బీజేపీ తెలంగాణలో బలోపేతం కావాలని చూస్తోంది. అందులో భాగంగానే వరుసగా సినిమా హీరోలతో సమావేశం అవుతున్నారు బీజేపీ నాయకులు. ఇక ఆకోవలోనే ప్రభాస్ తో కూడా భేటీ జరుగనున్నట్లు సమాచారం. 

    ACTRESS SHAMA SIKANDER:ఛాన్స్ కావాలంటే బెడ్ షేర్ చేసుకోవాల్సిందే : షామా సికిందర్

    actress-shama-sikander
    actress-shama-sikander
    actress-shama-sikander
    actress-shama-sikander

    బాలీవుడ్ హాట్ భామ షామా సికిందర్ బాంబ్ పేల్చింది. సినిమాల్లో ఛాన్స్ లు రావాలంటే దర్శక నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించి కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి తేనెతుట్టెను కదిపింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది షామా సికిందర్. ఆ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసి నిప్పు రాజేసింది.

    నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయ్యింది. నేను కొంతమంది సినిమాల్లో నటించలేదు. అయినప్పటికీ వాళ్ళు నాతో సన్నిహితంగా ఉండాలని , బెడ్ షేర్ చేసుకోవాలని మొహమాటం లేకుండా అడిగారు. నేను షాక్ అయ్యాను. అసలు నేను మీ సినిమాల్లో నటించలేదు కదా ! మరి ఎందుకు మీతో సన్నిహితంగా ఉండాలని ప్రశ్నించాను. దానికి అవకాశాలు రావాలంటే తప్పకుండా మామాట వినాల్సిందే అని చెప్పారని స్పష్టం చేసింది.

    కొన్నాళ్ల క్రితం వరకు ఈ కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న యువ దర్శక నిర్మాతలు కూడా తమ పక్కలో హీరోయిన్ లు పడుకోవాలని భావిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం హీరోయిన్ లకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగంలోనే లేదు …….. అన్ని రంగాల్లో కూడా ఉంది. కాకపోతే సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అంతే తేడా ! అని చక్కగా వివరిస్తోంది షామా సికిందర్. 

    PRABHAS- ANUSHKA:త్వరలోనే ప్రభాస్ – అనుష్క ల పెళ్లి ?

    prabhas-anushka-prabhas-anushka-wedding-soon
    prabhas-anushka-prabhas-anushka-wedding-soon
    prabhas-anushka-prabhas-anushka-wedding-soon
    prabhas-anushka-prabhas-anushka-wedding-soon

    త్వరలోనే ప్రభాస్ – అనుష్క ల పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు మరణించడంతో బహుశా వచ్చే ఏడాది అనుష్క – ప్రభాస్ ల పెళ్లి కానున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ప్రభాస్ – అనుష్క ల పెళ్లి వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. అలాగే ఆ వార్తలను అటు ప్రభాస్ ఇటు అనుష్క ఖండిస్తూనే ఉన్నారు.

    ఇలా ఎన్నిసార్లు ఖండన ఇస్తున్నప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. కృష్ణంరాజు ప్రభాస్ – అనుష్కల పెళ్ళికి అడ్డుగా ఉన్నాడనే వార్తలు వినిపించాయి అప్పట్లో. ప్రభాస్ పెళ్లి చేయాలని కృష్ణంరాజు అనుకున్నాడు కానీ అనుష్కతో కాదనే మాటలు వినిపించాయి. అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. ఇక అనుష్క కూడా వయసు మీద పడుతున్నప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

    ఇప్పుడు కృష్ణంరాజు లేడు కాబట్టి ప్రభాస్ – అనుష్క ల పెళ్లి అవ్వడం ఖాయమని వినిపిస్తోంది. అంతేకాదు పలువురు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఫిలిం నగర్ సర్కిల్లో. ఇక అనుష్క చేస్తున్న సినిమాలు కూడా గతకొంత కాలంగా కేవలం యువీ క్రియేషన్స్ సంస్థకు మాత్రమే చేస్తోంది. యువీ క్రియేషన్స్ ప్రభాస్ అన్నయ్య అలాగే ప్రభాస్ మిత్రులతో కలిసి ఏర్పడిన సంస్థ అనే విషయం తెలిసిందే. ప్రభాస్ – అనుష్క ల పెళ్లి అయితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా మంచి ఈడు జోడు అనే సంగతి తెలిసిందే. 

    AKHIL- SISINDRI: అఖిల్ మొదటి చిత్రానికి 27 ఏళ్ళు

    akhil-sisindri-akhils-first-film-is-27-years-old
    akhil-sisindri-akhils-first-film-is-27-years-old
    akhil-sisindri-akhils-first-film-is-27-years-old
    akhil-sisindri-akhils-first-film-is-27-years-old

    అఖిల్ నటించిన మొట్టమొదటి చిత్రం ”సిసింద్రీ ” . శివ నాగేశ్వర్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై నాగార్జున నిర్మించడం విశేషం. 1995 సెప్టెంబర్ 14 న ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో నాగార్జున స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు అలాగే టబు కూడా ఓ పాటలో మెరిసి కుర్రాళ్లను అలరించింది.

    అఖిల్ చిన్న వయసులోనే ఈ సినిమాలో నటించాడు. పూర్తిగా నడవటం రాదు అలాగే మాటలు కూడా రాని వయసులోనే సిసింద్రీ చిత్రంలో నటించి మెప్పించాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆమని , శరత్ బాబు , శివాజీరాజా , తనికెళ్ళ భరణి , సుధాకర్ , ఏవీఎస్ తదితరులు నటించారు.

    1995 లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికి 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దాంతో అప్పటి రోజులను తల్చుకుంటున్నారు ఆ చిత్రానికి పనిచేసిన నటీనటులు , సాంకేతిక నిపుణులు. అఖిల్ మొదటి చిత్రమే సూపర్ హిట్. అలాగే మనం చిత్రంలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే సోలో హీరోగా మాత్రం భారీ అపజయాలను మూటగట్టుకున్నాడు. హీరోగా సక్సెస్ కొట్టడానికి బాగానే తంటాలు పడుతున్నాడు. 

    గ్రాండ్ గా ‘శ్రీ రంగ‌నాయక’ ప్రీ రిలీజ్ పంక్ష‌న్

    sri-ranganayaka-pre-release-pankshan
    sri-ranganayaka-pre-release-pankshan
    sri-ranganayaka-pre-release-pankshan
    sri-ranganayaka-pre-release-pankshan

    సెప్టెంబ‌ర్ 23 న విడుద‌ల అవుతున్న  ‘శ్రీ రంగ‌నాయక’  చిత్రం

    అన్న‌మ‌య్య , శ్రీరామ‌దాసు, మంజునాథ, శిరిడిసాయి , ఓం న‌మో వెంక‌టేశాయ‌.. వంటి అద్భుత భక్తిరస చిత్రాల సరసన మరో సినిమా తెలుగు వెండితెరపైకి రాబోతుంది. నేటి యువ‌త‌కు శ్రీ మ‌హ‌విష్ణు మ‌హ‌త్యం తెలియ‌జేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై రామావ‌త్ మంగ‌మ్మ నిర్మిస్తున్న‌ భ‌క్తిర‌స చిత్రం ‘శ్రీ రంగ‌నాయక’. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మ‌హ‌విష్ణు పాత్ర‌లో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నంది వెంక‌ట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భ‌క్తుడి పాత్ర‌లో రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి ,పండ్రాల ల‌క్ష్మీ , ప‌ర‌వాడ స‌త్య‌మోహ‌న్, నిహారిక చౌద‌రి , త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు  ప్ర‌ధాన‌పాత్రల్లో న‌టిస్తున్నారు. డ్ర‌మ్స్ రాము సంగీతం అందించిన ఈమూవీ ఆడియో మ‌రియు ప్రీ రిలీజ్ పంక్ష‌న్ హైద్రాబాద్ ఏ.వి కాలేజ్ లో ఘ‌నంగా జ‌రిగింది.  సెప్టెంబ‌ర్ 23 న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ  పంక్ష‌న్ కి  ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం, ప్ర‌ముఖ న‌టులు కుప్పిలి శ్రీనివాస్ , గ‌బ్బ‌ర్ సింగ్ సాయి , బుచ్చిరెడ్డి , వెంక‌న్న , బాస్క‌ర్ యాద‌వ్ , కరాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామ‌చంద్ర శ్రీనివాస్ కుమార్ పలువురు ప్ర‌ముఖులు పాల్గోని  తెలుగు వెండితెరపై శ్రీరంగ‌నాయ‌క భక్తిరస చిత్రం అద్భుత విజయం సాదిస్తుంద‌ని అన్నారు.. అనంత‌రం …

    శ్రీ మ‌హ‌విష్ణు పాత్ర‌దారి దుందిగ‌ల్ విన‌య్ రాజ్ మాట్లాడుతూ :  మా శ్రీ రంగ‌నాయ‌క చిత్రం లో  శ్రీ మ‌హావిష్ణు పాత్ర‌లో న‌టించ‌డం పూర్వజ‌న్మ సుకృతం అన్నారు.. .ద‌ర్శ‌కులు నంది వెంక‌ట రెడ్డి గారు అద్భుతంగా చిత్రీక‌రించార‌ని తెలిపారు.. సెప్టెంబ‌ర్ 23 న  థియేట‌ర్ ల‌లో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఘ‌నవిజ‌యం అందించాల‌ని కోరారు.

    భ‌క్తుడి పాత్ర‌ధారి  రంగాబాషా మాట్లాడుతూ :  శ్రీ రంగ‌నాయ‌క చిత్రంలో భ‌క్తుడి పాత్ర‌లో న‌టించాన‌ని, ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ద‌న్య‌వాదాలు తెలిపారు..ఈ నెల 23 విడుద‌ల అవుతున్న మా మూవీ ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు

    న‌టుడు లంకెల అశోక్ రెడ్డి మాట్లాడుతూ : శ్రీ రంగ‌నాయ‌క చిత్ర ద‌ర్శ‌కులు వెంక‌ట్  రెడ్డి  గారు.. దుందిగ‌ల్ విన‌య్ రాజ్ గారి ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.. బిగ్ స్ర్కీన్ పై విన‌య్ రాజ్ గారిని చూస్తుంటే సాక్షాత్తూ శ్రీ మ‌హావిష్ణు దిగివ‌చ్చిన‌ట్టు ఉంద‌న్నారు.. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి రూపోందించిన ఈసినిమాను ప్రేక్ష‌కులు దిగ్విజ‌యం అందించాల‌ని కొరారు..

    అతిథి న‌టులు కుప్పిలి శ్రీనివాసరావు :  శ్రీ రంగనాయ‌క చిత్రంలో టైటిల్ రోలో పోషించిన దుందిగ‌ల్  విన‌య్ రాజ్ పాత్ర‌లో జీవించార‌ని అన్నారు.. చిన్న సినిమా అనుకున్నాం కానీ.. స్క్రీన్ పై అవుట్ పుట్ చూశాక ఓ పెద్ద సినిమా ను చూస్తున్న ఫీలింగ్ క‌లిగింద‌ని అన్నారు.. నిర్మాత ర‌మావ‌త్ మంగ‌మ్మ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించిన‌ట్లు తెలుస్తోంద‌ని, ఈ నెల 23 రిలీజ్ అయ్యే ఈ సినిమా మంచి ఆద‌ర‌ణ పోందుతుంద‌న్నారు. ఇత‌ర న‌టీన‌టులకు, టెక్నిషియ‌న్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

    గ‌బ్బ‌ర్ సింగ్ సాయి :  శ్రీ రంగ‌నాయ‌క చిత్రంలో మ‌హ‌విష్ణు పాత్ర‌లో న‌టించిన విన‌య్ రాజ్ గారిని స్ర్కీన్ పై చూస్తుంటే సాక్ష‌త్తూ  శ్రీ మ‌హావిష్ణు ని చూసిన ఫీలింగ్ క‌లిగిందన్నారు.. సాంగ్స్ , ట్రైల‌ర్స్ చాలా బాగున్నాయ‌ని …ఈ చిత్రం మంచి ఆద‌ర‌ణ పోందుతుంద‌ని అన్నారు…

    వీరితో పాటు ఏవి కాలేజ్ ప్రిన్సిప‌ల్ సిహెచ్ .రాజ‌లింగం, బుచ్చిరెడ్డి , వెంక‌న్న , బాస్క‌ర్ యాద‌వ్ , కరాటే గ్రాండ్ మాస్ట‌ర్ ఆర్.కె.క్రిషేనా , ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామ‌చంద్ర శ్రీనివాస్ కుమార్ చిత్ర‌యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు…

    నటీన‌టులు :  దుందిగ‌ల్ విన‌య్ రాజ్ ,రంగాబాషా , లంకెల అశోక్ రెడ్డి , పండ్రాల ల‌క్ష్మీ , ప‌ర‌వాడ స‌త్య‌మోహ‌న్ , నిహారిక చౌద‌రి , త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు , గుడ్డేటి ఆంజ‌నేయులు , న‌ర‌సింహా ,ఆనంద్ , మ‌ధుసూద‌న్ రెడ్డి లు న‌టించారు..
    డైరెక్ట‌ర్ : నంది వెంక‌ట్ రెడ్డి
    నిర్మాత :ర‌మావ‌త్ మంగ‌మ్మ
    క‌థ : న‌ర్ల రామ‌కృష్ణ రెడ్డి
    మ్యూజిక్ :  డ్ర‌మ్స్ రాము
    కెమెరా  :  యాద‌గిరి
    మాట‌లు : ముత్యాల గ‌ణేష్
    ఎడిటింగ్ :  ప్ర‌వీణ్ కుమార్ , విజయ్ కుమార్
    కోరియోగ్ర‌ఫి : ఆనంద్ మాస్ట‌ర్ , కృష్ణ మాస్ట‌ర్
    పి.ఆర్.ఓ : ద‌య్యాల అశోక్

    PRABHAS: ఇప్పట్లో షూటింగ్ చేయనని చెప్పిన ప్రభాస్

    prabhas-said-that-he-will-not-shoot-now
    prabhas-said-that-he-will-not-shoot-now
    prabhas-said-that-he-will-not-shoot-now
    prabhas-said-that-he-will-not-shoot-now

    డార్లింగ్ ప్రభాస్ ఇప్పట్లో షూటింగ్ చేయలేనని చెప్పాడట దర్శక నిర్మాతలకు. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. దాంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు ప్రభాస్. మాములుగా అయితే సలార్ షూటింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ చేయడం కష్టం కాబట్టి సలార్ దర్శక నిర్మాతలకు ఈ విషయాన్ని చెప్పాడట.

    ఒక్క సలార్ చిత్రం మాత్రమే కాదు ప్రాజెక్ట్ – K చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ కావాల్సి ఉండే కానీ ప్రభాస్ ఇపుడున్న పరిస్థితిలో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో వరుసగా ఉన్న సినిమాలను ఈనెలలో అసలు షూటింగ్ చేసేది లేదని కుండబద్దలు కొట్టాడట ప్రభాస్. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలకు తెలియజేయడంతో వాళ్ళు కూడా సరేనని అన్నారట.

    దాంతో ఇక ప్రభాస్ షూటింగ్ లో అడుగు పెట్టేది అక్టోబర్ లో మాత్రమే ! ఇక సలార్ , ప్రాజెక్ట్ – K చిత్రాల షెడ్యూల్స్ మారనున్నాయి. సలార్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తుండగా ప్రాజెక్ట్ – K చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్దనాన్న మరణంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు ప్రభాస్.