డార్లింగ్ ప్రభాస్ ఇప్పట్లో షూటింగ్ చేయలేనని చెప్పాడట దర్శక నిర్మాతలకు. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. దాంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు ప్రభాస్. మాములుగా అయితే సలార్ షూటింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ చేయడం కష్టం కాబట్టి సలార్ దర్శక నిర్మాతలకు ఈ విషయాన్ని చెప్పాడట.
ఒక్క సలార్ చిత్రం మాత్రమే కాదు ప్రాజెక్ట్ – K చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ కావాల్సి ఉండే కానీ ప్రభాస్ ఇపుడున్న పరిస్థితిలో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో వరుసగా ఉన్న సినిమాలను ఈనెలలో అసలు షూటింగ్ చేసేది లేదని కుండబద్దలు కొట్టాడట ప్రభాస్. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలకు తెలియజేయడంతో వాళ్ళు కూడా సరేనని అన్నారట.
దాంతో ఇక ప్రభాస్ షూటింగ్ లో అడుగు పెట్టేది అక్టోబర్ లో మాత్రమే ! ఇక సలార్ , ప్రాజెక్ట్ – K చిత్రాల షెడ్యూల్స్ మారనున్నాయి. సలార్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తుండగా ప్రాజెక్ట్ – K చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్దనాన్న మరణంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు ప్రభాస్.