అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ , నాగార్జున , షారుఖ్ ఖాన్ , రణబీర్ కపూర్ , అలియా భట్ , మౌనీ రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే బాయ్ కాట్ ట్రెండింగ్ కూడా అయ్యింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. దాంతో మొదటి వారంలో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి వారం పూర్తయ్యేసరికి 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో లాంగ్ రన్ లో మరో 100 కోట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు . అంటే ఈ సినిమాను నిర్మించిన నిర్మాతకు అలాగే బయ్యర్లకు లాభాలు రావాలంటే కనీసం 600 కోట్లు వసూల్ కావాలి.
ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే 600 కోట్ల వసూళ్లు రావడం కష్టమే ! అంటే ఈ సినిమాను కొన్న బయ్యర్లు నష్టపోవడం ఖాయం. కాకపోతే నిర్మాతకు మాత్రం లాభాలు వచ్చాయి. శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , ఓటీటీ రైట్స్ రూపంలో భారీ మొత్తాలే వచ్చాయి నిర్మాతలకు. కథ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయని , దాంతో ప్రేక్షకులను అలరించడం లేదని వాపోతున్నారు.