భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ పార్లమెంట్ మెంబర్ రిషి సునాక్ కు భారీగా మద్దతు పెరుగుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవికి భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ పోటీ పడుతున్నాడు. బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్ధిక శాఖని సమర్థవంతంగా నిర్వహించాడు రిషి సునాక్.
రిషి సునాక్ సమర్థుడు కావడంతో అతడి నాయకత్వం కోరుకుంటున్నారు కన్జర్వేటర్స్ . అయితే ఒక భారతీయుడు బ్రిటన్ ప్రధాని కావడం ఏంటి ? అని కక్ష్య కడుతున్నారు కూడా కొంతమంది. అందులో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఉన్నాడు. తన మద్దతుదారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసాడట. ఎవరు ప్రధాని అయినా ఫరవాలేదు కానీ రిషి సునాక్ మాత్రం అస్సలు కావద్దు అని.
అయితే బోరిస్ జాన్సన్ ఆదేశాలు ఖాతరు చేయకుండా రిషి సునాక్ కు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు బ్రిటన్లు. మొదటగా బ్రిటన్ ప్రధాని పదవి రేసులో 10 మందికి పైగా పోటీ పడగా మొదటి విడతలో ఎనిమిది మాత్రమే అర్హత సాధించారు. ఇక రెండో విడతలో రిషి సునాక్ అద్భుత విజయాన్ని సాధించాడు. ఇక ఈనెల 21 న ప్రధాని పదవిలో పోటీలో ఉండేది ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ! అందులో ఎలాంటి అనుమానం లేకుండా రిషి సునాక్ ఉండనున్నాడు. ఇక మరో అభ్యర్థి ఎవరు ? అన్నది మాత్రం ఈనెల 21 న తేలనుంది. అలాగే సెప్టెంబర్ 5 న బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు ? అనే విషయం తేలనుంది.