ఐదో రౌండ్ లో కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు రిషి సునాక్. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసారు. బోరిస్ జాన్సన్ రాజీనామాతో బ్రిటన్ ప్రధానమంత్రిగా పోటీ చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పటి వరకు మొత్తం అయిదు రౌండ్ లలో పోటీ జరుగగా అయిదు రౌండ్ లలో కూడా రిషి సునాక్ సంచలన విజయాలు సాధిస్తూ వచ్చాడు. ఇక బ్రిటన్ ప్రధాని పదవికి అడుగు దూరంలోనే ఉన్నాడు.
అయితే అసలైన పోటీ ఇపుడు మొదలు కాబోతోంది. ఇప్పటి వరకు ఎంపీల మద్దతుతో విజయం సాధించాడు రిషి సునాక్. అయితే ఇక నుండి కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు కీలకం. పోటీలో ఇప్పుడు రిషి సునాక్ తో పాటుగా లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. అయితే కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య 1.6 లక్షలు. కాగా వీళ్ళలో ఎవరు ఎక్కువగా ఏ వైపు మొగ్గు చూపితే వాళ్లే కన్జర్వేటివ్ పార్టీ నేతగా అలాగే బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక అవుతారు.
సెప్టెంబర్ 5 న తుది ఫలితం వెల్లడి కానుంది. ఈలోపు రిషి సునాక్ తో పాటుగా లిజ్ ట్రస్ కూడా పార్టీ సభ్యుల మద్దతు కోసం ప్రచారం చేయనున్నారు. ఇందులో ఎక్కువగా ఎవరు మద్దతు సాధిస్తే వాళ్లే తదుపరి ప్రధాని. ఆ అవకాశాలు అయితే మెండుగా రిషి సునాక్ కు ఉన్నాయనే భావిస్తున్నారు. రిషి బ్రిటన్ ప్రధాని అయితే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి ఓ భారతీయుడు ప్రధాని అవుతాడు. ఇది చరిత్ర అవుతుంది. ఆ చరిత్ర రిషి సునాక్ సృష్టించాలని ఆశిద్దాం.