Ranveer Singh-Prashant Varma : ‘హను-మాన్’ సూపర్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో భారీ ప్రొడక్షన్ హౌజ్ ను ఆయన సంప్రదించి తమ ప్రొడక్షన్ హౌజ్ లో సినిమా చేయాలని కోరుతున్నాయి. ఇలా భారీ ఆఫర్లు రావడంతో టాలెంటెడ్ డైరెక్టర్ ఒక సినిమాకు సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేశారు. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ ఉంటే బాగుంటుందని ఆయనను సంప్రదించాడు.
ఇద్దరి మధ్యా సమావేశాలు సజావుగా సాగడంతో ప్రాజెక్టులో నటించేందుకు రణ్ వీర్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి టెస్ట్ షూట్ లో పాల్గొనేందుకు రణ్ వీర్ సింగ్ ఇటీవల హైదరాబాద్ కు వచ్చాడు. ఆయన హైదరాబాద్ కు రావడం, టెస్ట్ షూట్ లో పాల్గొనడం వీడియో బైట్ రిలీజైంది. షూటింగ్ కోసం భారీ సెట్ నిర్మించారు. దీనికి ‘బ్రహ్మరాక్షస’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ, రణ్ వీర్ సింగ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే రణ్ వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకు తొందరపడి సంతకం చేయద్దని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రణ్ వీర్ సింగ్ త్వరలో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో డాన్-3 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మరి ‘బ్రహ్మరాక్షస’ కోసం ప్రశాంత్ వర్మ మరో హీరోని లాక్ చేస్తాడా? లేక రణ్ వీర్ సింగ్ ను ఒప్పించి తిరిగి తీసుకొస్తాడా? అనేది వేచి చూడాలి.