Natural Star Nani : పక్కింటి కుర్రాడిలా కనిపించే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాని తన సహజ సిద్ధమైన నటనతో స్టార్ గా ఎదిగాడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో సినిమా ను లైన్ పెడుతూ ముందుకు సాగుతున్నాడు. తన సినిమాలు మినిమం గ్యారంటీ ఉంటుందని నిరూపించుకున్నాడీ యంగ్ హీరో. గతేడాది ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా పూర్తి చేయబోతున్నాడు. ఆగస్ట్ 29న ఈ మూవీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఇది పూర్తికాక ముందే మరో మూడు సినిమాలకు కమిట్మెంట్ చేశాడు. అందులో ఒకటి వెల్దండి వేణు అలియాస్ బలగం వేణుతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు నిర్మాత.
బలగం సినిమాతో వేణు ఎంతో పేరుతెచ్చుకున్నాడు. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ సినిమాను ఊళ్లల్లో ప్రత్యేకంగా షోలు వేయించుకున్నారంటే ఈ సినిమా జనాలకు ఎంతలా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. బలగం సినిమాతో మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎంతో మంది ప్రశంసించారు. ఒక్కరి నుంచి నెగెటివ్ కామెంట్స్ రాకపోవడం విశేషం. ఈ సినిమా తర్వాత వేణుకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశాన్ని మనసులో రానివ్వకుండా ఆచితూచి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు.
నాని కోసం ‘ఎల్లమ్మ’
నేచురల్ స్టార్ నాని కోసం ‘ఎల్లమ్మ’ టైటిల్‌తో వేణు స్ర్కిప్ట్ రెడీ చేసుకున్నాడు. ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదల తర్వాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇండస్ర్టీలో ప్రచారం జరిగింది.
కానీ ఈ మూవీ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. నానినే ఈ చిత్రాన్ని సున్నితంగా వద్దని చెప్పినట్లు టాక్. బలగం వేణు చెప్పిన కథకు, దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిక కథకు దగ్గరగా ఉండడంతో నాని ఈ సినిమా చేయడం కుదరరని చెప్పినట్లు తెలుస్తున్నది. గతంలో సాహో ఫేం సుజిత్ తో సినిమా చేయాల్సి ఉండగా, అది కూడా పట్టా లెక్కక ముందే పక్కన పెట్టేశాడు. భవిష్యత్తులో మరో స్టోరీతో నాని-వేణు కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.