40.8 C
India
Sunday, April 28, 2024
More

    Nani and Anjali : నాని, అంజలిది 11 ఏళ్ల ప్రయాణం.. ఫొటోలు షేర్ చేసిన న్యాచురల్ స్టార్

    Date:

    Nani and Anjali
    Nani and Anjali

    Nani and Anjali : న్యాచురల్ స్టార్ నాని గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా.. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే న్యాచురల్ స్టార్ అని బిరుదు సంపాదించుకోవడంతో పాటు క్లాసు, మాస్ ఆడియన్స్ ను కూడా తన వైపునకు తిప్పుకున్నాడు. ఆయన మొదట డైరెక్టర్ బాపు, శ్రీను వైట్ల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశాడు. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

    ఈ సినిమాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. అవసరాల శ్రీనివాస్, కలర్స్ స్వాతి, భార్గవితో కలిసి నాని నటించారు. ఈ మూవీలో ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నాని వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.


    ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా తక్కువ సమయంలో స్టార్ డం సంపాదించుకున్న వ్యక్తుల్లో నాని మొదటి వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. అష్టా చమ్మా తర్వాత భీమిలీ, ఈగ, జెర్సీ, భలే భలే మగాడివో, శ్యామ్ సింగరాయ్, నేను లోకల్, దసరా ఇలా చాలా సినిమాల్లో నటించారు. ఆయన చేసిన సినిమాలు చాలా వరకు భారీ కలెక్షన్లను సాధించాయి. ఇక దసరా ఆయనను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టింది.

    నాని అంజనా ఎలవర్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన వివాహం జరిగి అక్టోబర్ 27కు 11 సంవత్సరాలు పూర్తయింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. 11 వసంతాలు పూర్తయిన సందర్భంగా నాని కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ‘మా బంధానికి 11 సంవత్సరాలు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇంకేముంది నెటిజన్లు ఆయన విశెష్ చెప్పడం మొదలు పెట్టారు.


    కెరీర్ పరంగా చూస్తే నాని మంచి పీక్ లో ఉన్నారని తెలుస్తుంది. దసరా పాన్ ఇండియా మూవీగా భారీ విజయం సాధించిన తర్వాత వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘హాయ్ నాన్న’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన మృణాల్ ఠాకూర్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇక ‘సరిపోదా శనివారం’ పోస్టర్ ఇటీవల రిలీజ్ కావడంలో భారీ వ్యూవ్స్ దక్కించుకుంది.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Nani : నాని తనయుడి టాలెంట్ కు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్..

    Hero Nani : ఇటీవల తన పుట్టిన రోజును స్పెషల్ గా...

    #Nani32 : క్రేజీ కాంబో, ఇంట్రెస్టింగ్ థీమ్

    #Nani32 : డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తో న్యాచురల్ స్టార్ నానీకి మంచి...

    Natural Star Nani : ‘ద‌స‌రా’ దర్శకుడు శ్రీకాంత్ కు న్యాచురల్ స్టార్ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

    Natural star Nani : న్యాచురల్ స్టార్ నానిని పూర్తిగా మాస్...

    Natural star Nani : కన్ఫ్యూజన్ లో న్యాచురల్ స్టార్.. తమిళ డైరెక్టర్ తోనా? తెలుగు డైరెక్టర్ తోనా?

    Natural star Nani : ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్...