32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Keshineni Nani : కేశినేని నాని ఓటమికి భాద్యులు ఎవరు ???

    Date:

    Keshineni Nani
    Keshineni Nani

    Keshineni Nani : రాజకీయ చదరంగంలో గెలుపు ఓటమిలు సహజం. ఒకసారి గెలిచిన నాయకుడు, మరోసారి గెలవాలనే నమ్మకం లేదు. ఓటమి చెందిన నాయకుడు కూడా గెలవాలనే నమ్మకం కూడా ఎక్కడ కూడా చరిత్రలో లేదు. రాజకీయంలో హత్యలు ఉండవు. ఆత్మ హత్యలే ఉంటాయి. ఇందుకు తార్కాణం విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన కేశినేని నాని ఒకరు.

    కేశినేని నానికి తెలుగు దేశం పార్టీలో ఒక ప్రధానమైన గుర్తింపు ఉంది. అంతే కద్దు అధినేత చంద్రబాబు నాయుడి వద్ద కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. అటువంటి నాయకుడికి పుట్టిన దుర్భుద్దే తన ఓటమికి ప్రధాన కారణమైనది.ఇంకో విదంగా చెప్పాలంటే వైసీపీ అధినేత, తాజా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధాన కారణమే అవుతుంది.

    ఎన్నికల సమయం ఆసన్నమయ్యే వరకు కూడా చంద్రబాబు వెంటే ఉన్న కేశినేని నాని అకస్మాత్తుగా ఒక్కసారి తన నిర్ణయాన్ని మార్చు కున్నారు. వెంటనే వైసీపీ కండువా వేసుకున్నారు. విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. స్వయానా సోదరుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఘన కార్యాలు కూడా మరొక కారణమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన పుణ్య కార్యక్రమాలు కూడా కేసి నేని నాని మోయడంతోనే ఓటమిని రుచి చూడాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

    తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పాటించడం నాని తో సాధ్యం కాలేదు. హద్దులు మీరు ప్రవర్తించారనే పేరు కూడా మూటగట్టుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ కండువా కప్పుకొని తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారనే అభిప్రాయాలు ఆయన సహచరుల నుంచి వ్యక్తం కావడం విశేషం. జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానాలే కేశినేని నాని రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంను కలువనున్న తెలుగు నిర్మాతలు

    AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు...