40.4 C
India
Thursday, May 23, 2024
More

    Yoga Day 2023 : 2023 అంతర్జాతీ యోగా దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా..?

    Date:

    Yoga Day 2023
    Yoga Day 2023

    Yoga Day 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు. కేంద్రంలో 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగాకు ప్రాధాన్యమిస్తూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. యోగాతో ఎన్నో ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి. శారీరక, మానసిక , ఆధ్యాత్మికంగా యోగా మనిషికి మేలు చేస్తుంది. దీంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం చక్కటి వేదికగా పనిచేస్తున్నది.

    ప్రధాని నరేంద్ర మోదీ 2014 లో ఐకరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన తర్వాత అంతర్జాతీయ యోగాను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.  అయతే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక థీమ్ తో నిర్వహిస్తున్నారు. యోగా ఫర్ వసుదైక కుటుంబం అని థీమ్ నిర్ణయించారు. ఒకే కుటుంబం.. ఒకే ప్రపంచం అనే అర్థంతో దీనిని నిర్వహిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ యోగా కార్యక్రమం ప్రస్తుత థీమ్ యొక్క స్పూర్తిని తెలియజేస్తున్నది.  ఒక్క భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ రోజు యోగా డేను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

    యోగా మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది. మనిషిలో ఒత్తిడిని తగ్గించి, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు శరీరానికి ఉన్న ఉన్న సంబంధాన్ని మెరుగు చేస్తుంది. అయితే జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా డే భిన్నమైన ప్రజలను ఏకం చేయడంలో చక్కటి వేదికగా నిలుస్తుంది. సామన్య ప్రజల నుంచి దేశ ప్రధాని, అధ్యక్షుల వరకు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రస్తుతం విదేశాల్లో యోగా ఎంతో  ఆదరణ పెరుగుతున్నది. ప్రత్యేక శిక్షకులను, భారీ వేతనాలు చెల్లించి మరి నియమించుకుంటున్నారు. యోగాతో వస్తున్న సంపూర్ణ ఆరోగ్య ఫలితాలే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Dil Raju : కూతురు సినిమాపై దిల్ రాజు మౌనం.. మరీ ఇంత వివక్ష ఎందుకు బాస్

    Dil Raju : తెలుగు లో ప్రస్తుతం దిల్ రాజు సక్సెస్...

    Kidney Stones : మహిళ కిడ్నీలో 77 రాళ్లు.. తొలగించిన వైద్యులు

    Kidney Stones : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక...

    Kalki Event : లవ్ యూ బుజ్జి..  కల్కి ఈవెంట్ సూపరో సూపర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే

    Kalki Event : కల్కి 2898 ఏడి బుజ్జి లాంచ్ ఈవెంట్...

    Inter Supplementary Exams : రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

    Inter Supplementary Exams : రేపటి (శుక్రవారం) నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    Richard Gere : నరేంద్ర మోడీ ఓ మోడల్.. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్

    Richard Gere : జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఈ...

    Heroines Yoga : హీరోయిన్ల ఆసనాలు చూస్తే.. చెమటలు పట్టాల్సిందే..!

    Heroines Yoga : ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా హీరోయిన్స్ తమ గ్లామరస్...