30.1 C
India
Friday, June 7, 2024
More

    Power Star Pawan Kalyan : మూడో పెళ్లి కూడా ముడిపడలేదా? పవన్ వైవాహిక జీవితం మరోసారి ముక్కలయ్యిందా?

    Date:

    Power Star Pawan Kalyan : టాలీవుడ్ లో తన హీరోయిజంతో తిరుగులేని స్టార్ గా ఎదిగిన హీరో పవన్ కళ్యాణ్.. తెలుగులో అద్భుత విజయాలు సొంతం చేసుకొని తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. అన్నకు మించిన తమ్ముడు అని నిరూపించుకున్నాడు. అలాగే సేవా దృక్పథం లోని ఎంతో ముందుంటాడు. తన సినిమాలు కొన్ని ప్లాప్ కాగా,  తన రెమ్యూనరేషన్ లోంచి డిస్ట్రిబ్యూటర్లకు, బయర్లకు కొంత తిరిగిచ్చాడు
     అలాగే నిర్మాతలను కూడా ఆదుకున్నాడు. కెరీర్ మంచి పిక్ టైంలో ఉండగానే తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాలు మళ్లీ కీలకంగా మారాడు. కానీ పవన్ తన వ్యక్తిగత జీవితంలో రెండు విషయాల్లో మాత్రం సక్సెస్ కాలేక పోతున్నాడు. తనకున్న ప్యాన్ బేస్ తో రాజకీయంగా కీ రోల్ పోషించాల్సిన పవన్ చతికిల పడిపోతున్నాడు.
    ఇప్పటి వరకు రాజకీయంగా మాత్రం ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయాడు. అలాగే తన సినిమా కెరీర్ ముందు నుంచి వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకించి వైవాహిక జీవితం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా వైజాగ్ కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకు ఆమెకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే బద్రి సినిమా టైంలో తన కోస్టార్  రేణు దేశాయ్ తో ప్రేమాయణం  సాగించాడు. సహజీవనం చేశారు.  కొడుకును కూడా కన్నారు.  కానీ ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల సమయంలో  ఇతర పార్టీల నుంచి విమర్శలు రావడంతో  పవన్ కళ్యాణ్ రేణు దేశాయిని పెళ్లి చేసుకోక  తప్పలేదు. అయితే  అలాగే ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. వారిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా నటితో పెళ్లి జరిగింది. అప్పటికే ఆమెకు పిల్లలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తోనూ ఒక కూతురికి జన్మనిచ్చింది. కాగా కొద్ది రోజుల నుంచి మూడో భార్య కు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడంటూ రూమర్లు వచ్చాయి. ఆ రూమర్లు నిజం కాబోతున్నాయని జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం వారాహి యాత్రతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మూడో భార్య విడాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడాకుల కు సంబంధించిన నోటీసులు కూడా పవన్ కు అందినట్లు సమాచారం.అటు రాజకీయంగా బిజీగా ఉంటూనే, ఇటు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మూవీ కెరీర్‌లో అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఆయన.. తన వైవాహిక జీవితంలో మాత్రం  ముచ్చటగా మూడోసారి ఫెయిల్ అయిపోయాడా అనే సందేహాలు తలెత్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆయన మూడో భార్య అన్నా లేజినోవా విడాకులకు సంబంధించిన లీగల్ నోటీసులు పంపించిందని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రం వైరల్‌గా మారుతుంది.  ఏపీ అధికార పార్టీపై దూకుడుగా వ్యవహరిస్తున్న పవన్ ను మానసికంగా దెబ్బకొట్టేందుకు, ఇలాంటి రూమర్లు, ఆయా పార్టీల ఛానల్ లో ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ నోరు విప్పితే కానీ నిజం బయటికి వచ్చేలా లేదు.

    Share post:

    More like this
    Related

    Nirabh Kumar Prasad : ఏపీ నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్.. ఉత్తర్వులు జారీ

    Nirabh Kumar Prasad : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌...

    Pinnelli : ‘పిన్నెల్లి’కి హైకోర్టులో ఊరట

    Pinnelli : వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి...

    CM Revanth Reddy : ఆ సీఎంకు ఇక ఢోకాలేదు

    CM Revanth Reddy : తెలంగాణలో అధికార పగ్గాలు సీఎం రేవంత్ రెడ్డి...

    Jagan Trolls : 151 నుంచి చివరకు పంగనామాలు మిగిల్చారు!

    Jagan Trolls : ఏపీ ఎన్నికలు భవిష్యత్ పాలకులకు ఒక అధ్యయనంలాంటివి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Family : ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ భేటీ

    Pawan Family : ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశానికి జనసేన...

    Nagababu : టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు

    Nagababu : టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబును నియమించే...

    AP Politics : పార్టీ పటిష్టతకే వారి ప్రాధాన్యం?  

    AP Politics : ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారానికి దూరమైన టీడీపీ అంతే...

    Leader of the NDA Party : ఎన్డీయే పక్షనేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

    సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్ Leader of the NDA Party...