31.3 C
India
Sunday, June 16, 2024
More

    Marriage : తాళికట్టు శుభవేళ.. ఆగిన పెండ్లి..

    Date:

    Marriage
    Marriage

    Marriage : వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక శుభ సమయం. ఇరు కుటుంబాల ఆశీస్సులతో, మేళాతాళలతో బంధువుల ఆనందోత్సాహాలతో జరిగే ఈ తంతు చాలామందికి ఒక తీపి జ్ఞాపకం.. అయితే ఇలాంటి సమయంలోనే కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. పెళ్ళికొడుకు చేతుల్లోంచి తాళిని లాక్కొని హుండీలో వేసేందుకు ప్రయత్నించింది పెళ్లికూతురు.  ఒక్కసారిగా అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

    తమిళనాడులోని రామనాథపురం లో ఈ ఘటన జరిగింది. రామనాథపురం జిల్లా తిరువడినై గ్రామంలో స్థానిక యువకుడు ఒకరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అతని పక్క గ్రామానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. సోమవారం ఉదయం తిరుమల గ్రామంలో ఉన్న ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం వధూవరులు వివాహ రిజిస్టర్లు సంతకాలు కూడా చేశారు. పూలమాలలు మార్చుకున్నారు.

    అయితే వరుడు వధువు మెడలో తాళికట్టబోతున్న సమయంలో ఒక్కసారిగా ఆమె తాళి లాక్కొని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. తాళిని వెంటనే హుండీలో వేసేందుకు ప్రయత్నించింది. అయితే బంధువులు సమాధానం పరచడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు రంగంలోకి విచారణ చేపట్టారు. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రుల బలవంతం మేరకే ఒప్పుకున్నట్లు చెప్పింది. మరోవైపు వరుడు ఇంట్లో వివాహ విందు కార్యక్రమం కొనసాగింది. అక్కడ పెళ్లి ఆగిన విషయం తెలువక వచ్చిన బంధువులు చదివింపులు కూడా జరిపించేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వారంతా అవాక్కయ్యారు. గ్రామంలో ప్రస్తుతం ఈ వివాహం ఆగిన విషయం పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియోలో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    T20 Cricket New Jersey : డా. జై గారి సహకారంతో న్యూజెర్సీలో టీ-20 హవా.. దుమ్మురేపిన ‘టీమ్ 1983’

    T20 Cricket Match New Jersey : భారతీయులు ఎక్కడుంటే అక్కడ...

    ATA Convention Recap : అట్లాంటాలో వైభవంగా ATA కన్వెన్షన్ రీక్యాప్, కండ్లు చెదిరేలా కార్యక్రమాలు..

    ATA Convention Recap : అట్లాంటాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్...

    American Woman : ప్రియుడి కోసం.. భారత్ కు అమెరికా యువతి

    American Woman : పబ్ జీ ప్రేమలో పడి భారత్ కు...

    Char Dham Yatra : కుమార్తె తోడుగా సైకిల్ పై చార్ ధామ్ యాత్ర

    Char Dham Yatra : గుజరాత్ కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kerala News : భర్తను అలా అనడం క్రూరత్వమే..

    Kerala News : వివాహమనేది అనేది ప్రతిఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం....

    Marriage Registration : మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

                ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ...

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Dowry Harassment : రూ. 15 లక్షలు ఇస్తేనే శోభనం.. లేదంటే కుదరదు

    Dowry Harassment : డబ్బుకు లోకం దాసోహం. ధనం మూలం ఇదం...