28.3 C
India
Monday, May 13, 2024
More

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Date:

    sleeplessness
    sleeplessness

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత అవసరమో వాటి కంటే ఎక్కువగా నిద్ర అవసరం. శరీరాననికి ఎనర్జీ ఇవ్వడంలో నిద్రను మించిన సాధనం లేదనేది ఆరోగ్య విశ్లేషకులు చెప్తుంటారు. కొన్ని రోజుల వరకు ఆహారం లేకుండా బతకవచ్చు కానీ నిద్ర లేకుండా ఎక్కువ రోజులు జీవించడం అంత సులువు కాదు. నిద్రతో శరీరంలోని చాలా అవయవాలు రీచార్జ్ అవుతాయి. ప్రతీ అవయవం కాసేపు రిలాక్స్ అయ్యి.. లేవగానే ఉత్తేజంగా రీ బూట్ అవుతుంది.

    కొందరు అర్థరాత్రైనా నిద్రపోరు. పైగా వారి నిద్ర సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి చాలా మంది తమ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల కలిగే మానసిక, శారీరక సమస్యల గురించి వారికి సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టం తెస్తుంది.

    రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది..
    రోగ నిరోధక వ్యవస్థ అనేది శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తగ్గితే అంటు వ్యాధులు, అనారోగ్యాలు ఎక్కువైపోతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి శరీరంలో సైటోకిన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది రోగనిరోధక ప్రతిస్పందనకు కీలకమైన ప్రోటీన్. దీని ఉత్పత్తికి ఆటంకం కలిగి శరీరం ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడే సామర్థ్యం కోల్పోతుంది. ముఖ్యంగా చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ చాలా అవసరం. లేదంటే సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ రోగాలకు, పునరుత్పత్తిని మెరుగుపరచడానికి నాణ్యమైన నిద్ర అవసరం.

    తగ్గనున్న జ్ఞాపక శక్తి
    క్రమ రహితమైన నిద్ర మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. నిద్ర లేకపోవడం వల్ల మతిమరుపు వస్తుంది. చిన్న చిన్న విషయాలను కూడా త్వరగా మరచిపోతారు. రోజుకు కనీసం 7 గంటల నిద్ర లేకుంటే జ్ఞాపకశక్తి సామర్థ్యం తగ్గుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ఇవి రోజువారీ పనితీరుపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి అల్జీమర్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత రుగ్మతలను కలిగిస్తుంది. కాబట్టి మీకు నిద్ర సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

    మానసిక కల్లోలం..
    మానసిక ఆరోగ్యం.. నిద్ర ద్వారా ప్రభావితమవుతుంది. ఈ నిద్రలేమి మానసిక ఉల్లాసాన్ని దెబ్బతీస్తుంది. ఆందోళన, నిరాశతో ఉండేలా చేస్తుంది. మానసికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను కూడా ఇది తీవ్రతరం చేస్తుంది.

    ఆకలిలో మార్పులు
    క్రమ రహిత నిద్ర శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆకలి నియంత్రణను ప్రభావితం చేస్తుంది. లెప్టిన్, గ్రెలిన్ వంటి ఆకలిని నియంత్రించే హార్మోన్లు నిద్ర ద్వారా ప్రభావితమవుతాయి. నిద్రలేమి ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది అతిగా తినడం లేదా అనారోగ్యకరమైన ఫుడ్ తినేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇది బరువు పెరగడానికి, ఊబకాయం, మధుమేహం  వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

    హృదయ సంబంధ వ్యాధులు
    నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల చాలా మంది గుండెపోటుకు గురి అవుతున్నట్లు పలు అధ్యయానాలు నిరూపించాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరంలో రక్తపోటు, ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. అనతీకాలంలోనే హృదయనాళ వ్యవస్థను దెబ్బతీస్తుంది.

    కాబట్టి నిద్ర ప్రాముఖ్యతను గుర్తించి.. నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా కూడా హెల్తీగా ఉంచుతుంది. దీనికోసం మీరు మెరుగైన నిద్ర అలవాట్లు చేసుకోండి. నిద్రపోయే స్థలం నిద్రకు అనువుగా ఉండేలా చూసుకోండి. పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. ఇవి నిద్రనాణ్యతను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. ఇవేమి మీ నిద్రను మెరుగుపరచకుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

    Share post:

    More like this
    Related

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Over Thinking : మీరూ అలా ఆలోచిస్తున్నారా..చనిపోతారు జాగ్రత్త?

    Over Thinking : తమ ఆరోగ్యం గురించి ఎక్కువగ ఆందోళన చెందే వారు...