
Over Thinking : తమ ఆరోగ్యం గురించి ఎక్కువగ ఆందోళన చెందే వారు త్వరగా చనిపోయారని స్వీడన్ పరిశోధకుల సర్వే లో తేలింది. దీన్ని సిక్/ఇల్ నేస్ యంగ్జైటీ డిజార్డర్ అంటారని వారు తెలిపారు. ఆరోగ్యం పట్ల తక్కువ ఆందోళన ఉన్నవారి కంటే వీరు సగటున ఐదేళ్లు ముందుగా చనిపోతున్నారని వారు తెలిపారు. ఆందోళన డిప్రెషన్ తో పాటు అనారోగ్యానికి గురి కావడంతో కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలిందన్నారు.
ఆరోగ్యం గురించి అతిగా ఆలోచించద్దని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. మారుతున్న నేటి జీవన విధానంలో ఆహారంలో ఎన్నో మార్పులు వస్తు న్నాయి. చెడు ఆహారపు అలవాట్లు వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత మనిషి మానసికంగా కృంగి పోతారు. తనకు ఏమైందో.. ఏమవుతుందో అన్న భయం వారిని రోజు వెంటాడుతుంది. ఈ క్రమంలో ఎక్కువ జీవించాలఅనుకున్నా వారు కూడా తక్కువ సమయంలోనే చనిపోతున్నారు.
ప్రతి ఒక్కరు మంచి జీవనశైలిని అలవర్చుకోవాలి మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అతిగా ఆలోచించే సమస్య నుంచి బయటపడడానికి యోగ వంటివి గెలవచుకో వాలని వారు సలహా ఇస్తున్నారు.