38 C
India
Saturday, May 11, 2024
More

    Natural Star Nani : ‘ద‌స‌రా’ దర్శకుడు శ్రీకాంత్ కు న్యాచురల్ స్టార్ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

    Date:

    Natural star Nani
    Natural star Nani

    Natural star Nani : న్యాచురల్ స్టార్ నానిని పూర్తిగా మాస్ గా చూపించిన మూవీ ‘ద‌స‌రా’. నాని గెట‌ప్‌, ఎమోష‌న్స్‌, ఫ్రెండ్షిప్‌, యాక్షన్‌.. అన్నీ ఈ సినిమాలో బాగా పండాయి. పాట‌లు కూడా భారీగా హిట్ అయ్యాయి. నానితో పాటు కీర్తి సురేశ్ కు దసరాతో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతోనే ద‌ర్శకుడిగా శ్రీ‌కాంత్ ఓదెల‌ అరంగేట్రం చేశాడు. తొలి సినిమాలోనే త‌న మార్క్ చూపించాడు.

    ఇక దసరా తర్వాత శ్రీ‌కాంత్ నుంచి మరో సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే.. నానితోనే మ‌రో సినిమా చేయాలని శ్రీకాంత్ ఓదెల అనుకుంటున్నాడని టాక్. ‘ద‌సరా’తో భారీ బాక్సాఫీస్ హిట్ ఇచ్చినందుకు రిట‌ర్న్ గిఫ్ట్ గా నాని శ్రీ‌కాంత్ కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. ‘ద‌స‌రా’ను తెర‌కెక్కించిన చెరుకూరి సుధాక‌రే ఈ అప్ కమింగ్ మూవీకి నిర్మాతగా వ్యవహిస్తుండడం విశేషం.

    ఈ సినిమాకు సంబంధించి కథ ఇప్పటికే ఓకే అయ్యింది. ఇప్పుడు తుది మెరుగులు మాత్రం దిద్దుతున్నారు. నాని ప్రస్తుతం ‘స‌రిపోదా శ‌నివారం’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ – నాని కాంబినేష‌న్‌లో ఓ సినిమా కూడా ఫిక్స్ అయినట్లు స‌మాచారం అందుతుంది. దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ‘స‌రిపోదా శ‌నివారం’ త‌ర‌వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా మొదలవుతుందని టాలీవుడ్ సర్కిల్ లో టాక్ ఉంది. అదేమైనా ఆల‌స్యం జరిగితే శ్రీ‌కాంత్ ఓదెలతో సినిమా మొదలు పెడతారు నాని.

    నాని-మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న ఇటీవల రిలీజైంది. కూతురు ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా కాకపోయినా పర్వాలేదనిపించింది.

    Share post:

    More like this
    Related

    Election 2024 : ప్రలోభాల పర్వం.. 540 బియ్యం బస్తాలు స్వాధీనం

    Election 2024 : ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో నాయకులు...

    Engagement : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్..  బాలిక తల నరికిన వరుడు

    Engagement Cancel : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం...

    Pak Trolls : ఇందుకోసమేనా ఆర్మీ శిక్షణ తీసుకున్నది..?

    పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్ Pak Trolls :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Nani : నాని తనయుడి టాలెంట్ కు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్..

    Hero Nani : ఇటీవల తన పుట్టిన రోజును స్పెషల్ గా...

    #Nani32 : క్రేజీ కాంబో, ఇంట్రెస్టింగ్ థీమ్

    #Nani32 : డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తో న్యాచురల్ స్టార్ నానీకి మంచి...

    Nani and Anjali : నాని, అంజలిది 11 ఏళ్ల ప్రయాణం.. ఫొటోలు షేర్ చేసిన న్యాచురల్ స్టార్

    Nani and Anjali : న్యాచురల్ స్టార్ నాని గురించి పరిచయం...

    Natural star Nani : కన్ఫ్యూజన్ లో న్యాచురల్ స్టార్.. తమిళ డైరెక్టర్ తోనా? తెలుగు డైరెక్టర్ తోనా?

    Natural star Nani : ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్...