27.9 C
India
Monday, June 24, 2024
More

    AP News : గుంతల రోడ్లకు ఇద్దరు బలి

    Date:

    AP News
    AP News

    AP News : ఏపీలో గుంతల రోడ్లు మనుషుల ప్రాణాలను బలిచేస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లో పడి మరొకరు మంగళవారం మృతి చెందారు.

    చింతలపూడి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆలేటి రామ్ చంద్, జ్యోతి (34) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రామ్ చంద్ బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు పశు వైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. దీంతో అక్కడికి దగ్గరలోని తెనాలి సుల్తానాబాద్ లో కుటుంబంతో సహా ఉంటున్నారు. మంగళవారం రాత్రి వారి కుమార్తెల నృత్య ప్రదర్శన ఉండడంతో చూసేందుకని రామ్ చంద్, జ్యోతిలు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. చింతలపూడి వద్దకు రాగానే రోడ్డుపై పెద్ద ఎత్తున ఉన్న గుంతలను చూచి రామ్ చంద్ అకస్మాత్తుగా బ్రేకులు వేశారు. జ్యోతి కంగారుపడి ముందుకు దూకేయడంతో ఆమె ముఖం రోడ్డుకు బలంగా తాకి స్పృహ కోల్పోయింది. వెంటనే తెనాలి ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందింది.

    కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన వడ్లమూడి మహాలక్ష్మీ కోటేశ్వరరావు (61) సోమవారం రాత్రి సరకులు కొనడానికి మోటారు సైకిల్ పై మార్కెట్ కు వెళ్లారు. చీకటిలో ఆయన తిరిగి వస్తుండగా గుంతలు పడి బురదమయంగా ఉన్న రోడ్డుపై వాహనం జారి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వస్తున్న యువకులు కోటేశ్వర రావును గమనించి సపర్యలు చేశారు. ఆయన ఊపిరి తీసుకుంటున్నాడని గుర్తించి వెంటనే 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటేశ్వరరావు రోడ్డుపై నిలిచిన బురద కారణంగానే మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad News : సెల్ ఫోన్ చోరీ ముఠా అరెస్టు.. గాయపడిన మసూద్

    Hyderabad News : సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కరడుకట్టిన...

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. సీసీఎస్ వద్ద బాధితుల ఆందోళన

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్ లో భారీ...

    Jagan Why Not 175 : వైనాట్ 175 ఏమైంది జగన్?

    Jagan Why Not 175 : ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా...

    Uttar Pradesh : వివాహేతర సంబంధం తెచ్చిన తంటా.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్..

    Uttar Pradesh : వివాహేతర సంబంధాలు జీవితాలనే మరుస్తాయనేందుకు ఎన్నో ఉదాహరణలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Tweet : వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

    Jagan Tweet : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదు...

    Minister Kollu Ravindra : వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం: మంత్రి కొల్లు రవీంద్ర

    Minister Kollu Ravindra : వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం...