32.5 C
India
Wednesday, June 26, 2024
More

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి

    Date:

    Nilima Divi
    Nilima Divi

    Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్ లో రూ. 80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొన్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్ కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ. 35 వేల వరకు ధరలు ఉన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. సీసీఎస్ వద్ద బాధితుల ఆందోళన

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్ లో భారీ...

    Hyderabad : హైదరాబాద్-కౌలాలంపూర్ విమానంలో సాంకేతిక సమస్య.. 3 గంటలు గాలిలోనే చక్కర్లు

    Hyderabad-Kuala Lumpur Flight : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా...

    Fake Police : నకిలీ పోలీస్.. రూ. 10 లక్షలు వసూలు

    Fake Police : లగ్జరీ లైఫ్, గుర్రప్పందాలు, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్...

    Cyber Crime : దావూద్ తో సంబంధం ఉందని.. రూ.20 లక్షలు కొట్టేశారు..

    Cyber Crime : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇడ్రహీంతో సంబంధాలు...